Begin typing your search above and press return to search.

కలరిపయట్టు విద్య‌లో ఫీమేల్ OG స్పీడే వేరు

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే మార్షల్ ఆర్ట్స్ `నాన్ చాక్` విద్యలో నిపుణుడు. ఆయన వెండితెరపై నాన్ చాక్ తిప్పుతుంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.

By:  Sivaji Kontham   |   11 March 2026 4:00 AM IST
కలరిపయట్టు విద్య‌లో ఫీమేల్ OG స్పీడే వేరు
X

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే మార్షల్ ఆర్ట్స్ `నాన్ చాక్` విద్యలో నిపుణుడు. ఆయన వెండితెరపై నాన్ చాక్ తిప్పుతుంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. న‌టించిన మొద‌టి సినిమాలో లైవ్ గా ప‌వ‌న్ మార్ష‌ల్ విద్య‌ల ప్ర‌ద‌ర్శ‌న‌ను చూసాం. ఖుషి లాంటి చిత్రంలోను ప‌వ‌న్ త‌న మార్ష‌ల్ ఆర్ట్స్ స్కిల్స్ ని బ‌య‌ట‌పెట్టారు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ `OG` (ఓజీ) చిత్రంలో నటించిన‌ నటి శ్రీయా రెడ్డి మార్ష‌ల్ విద్య‌ల‌లో పవర్‌స్టార్‌నే మించిపోయి `ఫీమేల్ OG` అనిపించుకుంటోంది. మార్షల్ ఆర్ట్స్‌లో శ్రీ‌యా చూపుతున్న నైపుణ్యం చూసి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ స్పెల్ బౌండ్ అయిపోయి.. ఫీమేల్ ఓజీ అంటూ కితాబిచ్చేస్తున్నారు. శ్రీ‌యారెడ్డి సాధన ఏ స్థాయిలో ఉందో ఈ వీడియోతో స్ప‌ష్ఠంగా అర్థం చేసుకోవచ్చు.

శ్రీయా రెడ్డి ఒక పాత్రను ఎంచుకుంటే దానికోసం ప్రాణం పెట్టేయ‌డం త‌న‌ శైలి. కేవలం నటనకే పరిమితం కాకుండా అత్యంత కఠినమైన `కలరిపయట్టు` విద్యను శ్రీ‌యా అభ్యసిస్తున్నారు. ఇందులో భాగంగా మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ అయిన `ఉరిమి`ని గిరగిరా తిప్పుతూ ఇస్తున్న లైవ్ ప్రదర్శనలు చూస్తుంటే యుద్ధంలోకి దిగిన రుద్రకాళిని తలపిస్తోంది. త‌న‌ స్పీడ్ - ఫోకస్ చూస్తుంటే పవన్ కల్యాణ్ లాంటి మార్ష‌ల్ విద్య‌లు తెలిసిన స్టార్ హీరోను కూడా ఫేస్-టు-ఫేస్ హ్యాండిల్ చేయగ‌ల ధీర అని అర్థమవుతోంది.

సినిమా షూటింగ్ సమయంలో శ్రీయా రెడ్డి కనబరిచిన అంకితభావం పవన్ కల్యాణ్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. త‌న‌ నటనకు ఫిదా అయిన పవర్‌స్టార్ మరోసారి అవకాశం ఉంటే శ్రీయా రెడ్డితో కలిసి నటించాలని ఉందని బహిరంగంగా వ్యాఖ్యానించడం చూస్తే త‌న ప్ర‌తిభ ఏ రేంజులో ఆక‌ర్షిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా తోటి నటీనటుల గురించి పవన్ ఇంతగా ప్రశంసించడం చాలా అరుదు. ఇది శ్రీయా రెడ్డి ప్రతిభకు దక్కిన ఒక గొప్ప సర్టిఫికేట్‌గా ఫ్యాన్స్ భావించారు.

స్టార్ హీరో విశాల్‌కు స్వ‌యానా వదిన అయిన శ్రీయా రెడ్డి గతంలో విశాల్‌తో పోటీ పడుతూ పలు చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబరిచారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలైనా, ఎమోషనల్ రోల్స్ అయినా తనదైన ముద్ర వేయడం శ్రీ‌యాకు వెన్నతో పెట్టిన విద్య. ఇటీవ‌ల OG చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో శ్రీ‌య రెడ్డి అద‌ర‌గొట్టేసారు.

శ్రీ‌యా రెడ్డి కెరీర్ జ‌ర్నీని ప‌రిశీలిస్తే....

విశాల్ తో క‌లిసి `పొగరు` సినిమాలో ఈ బ్యూటీ పోషించిన నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. `కంచివరం` వంటి కళాత్మక చిత్రంతో పాటు ఇటీవలి కాలంలో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన `సుడల్` వెబ్ సిరీస్ లోను శ్రీ‌యా నటనలోని వైవిధ్యాన్ని చాటుకున్నారు. ఇక `సలార్: పార్ట్ 1`లో రాధా రమగా కనబరిచిన పవర్‌ఫుల్ నటన టాలీవుడ్‌లో గ్రాండ్ రీ-ఎంట్రీని ఇచ్చింది.

ప్రస్తుతం శ్రీయా రెడ్డి తన కెరీర్‌లో అత్యంత కీలకమైన క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న `సలార్ 2: శౌర్యాంగ పర్వం`లో కూడా తన పవర్‌ఫుల్ పాత్రను రిపీట్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా 2026 చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తమిళం- తెలుగు రెండు భాష‌ల్లోను శ్రీయా రెడ్డి తన హవా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో రెండు భారీ వెబ్ సిరీస్‌లు, ఒక ఫీచర్ ఫిల్మ్ షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రధానంగా `సలార్ 2` వంటి పాన్-ఇండియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని శ్రీ‌యా చూస్తున్నారు. తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో యాక్ష‌న్ క్వీన్ గా ఇటు సినీ వర్గాలు, అటు అభిమానులకు శ్రీ‌యా రెడ్డి స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు.