షాట్ ముందు 60 పుషప్స్.. నెక్ట్స్ లెవెల్ డెడికేషన్
సిని ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. వారు లైఫ్ లో భలే ఎంజాయ్ చేస్తారు. వారికి నచ్చినట్టు ఉంటారు అని ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 8 Oct 2025 11:00 PM ISTసిని ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. వారు లైఫ్ లో భలే ఎంజాయ్ చేస్తారు. వారికి నచ్చినట్టు ఉంటారు అని ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్లకుండే కష్టాలు వారికే ఉంటాయి. ఇండస్ట్రీలో ఉండటం అంతా ఆషామాషీ వ్యవహారం కాదు. దానికోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. నచ్చిన ఫుడ్ కడుపునిండా తినే కనీస వెసులుబాటు కూడా ఉండదు నటీనటులకు.
ఓజిలో ఆడియన్స్ ను మెప్పించిన శ్రియారెడ్డి
నటీనటులు అందరూ ఎక్కువగా దీన్ని ఓ ప్రాబ్లమ్ లాగా చూస్తే కొందరు మాత్రం అది తమ బాధ్యత అనేలాగా ప్రవర్తిస్తూ సరైన ఫిట్‌నెస్ ను మెయిన్‌టెయిన్ చేస్తూ ఆడియన్స్ ను ఆశ్చర్యపరచడమే కాకుండా వారిని ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నటి శ్రియా రెడ్డి కూడా ఒకరు. తన అద్భుతమైన యాక్టింగ్ తో రీసెంట్ గా ఓజి సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు శ్రియా.
ఫిట్‌నెస్ విషయంలో శ్రియాకు పవన్ నుంచి ప్రశంసలు
సలార్, ఓజి సినిమాల్లోని తన నటనకు ఆడియన్స్ నుంచి మంచి పేరు, గుర్తింపును తెచ్చుకున్న శ్రియా రెడ్డి డెడికేషన్ తెలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. శ్రియా మంచి ఫిట్‌నెస్ ఫ్రీక్. శ్రియా రెడ్డి ఫిట్‌నెస్ గురించి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సైతం ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియా తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
ఆ కాన్ఫిడెన్స్ లోపలి నుంచే రావాలి
షాట్ కు వెళ్లే ముందు తానెప్పుడూ కొంత టైమ్ తీసుకుంటానని, ఆ టైమ్ లో రన్నింగ్ చేయడం, చిన్న చిన్న వర్కవుట్స్ చేసి, ఆ తర్వాత షాట్ కు వెళ్తానని, సలార్ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా షాట్ కు వెళ్లే ముందు ప్రతీసారి 50- 60 పుషప్స్ చేసి షాట్ కు వెళ్లేదాన్నని, అలా చేయడం వల్ల తనకు కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపించడంతో పాటూ ఆ క్యారెక్టర్ లో తాను పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాననే ఫీలింగ్ వచ్చేదని శ్రియా చెప్పుకొచ్చారు. ఖాన్సార్ లో తాను చాలా మంది మగవాళ్ల మధ్య నిలబడాల్సి వచ్చినప్పుడు తాను పవర్‌ఫుల్ గా కనిపించాలంటే, లోపల నుంచే కాన్ఫిడెన్స్ రావాలని, అలాంటి వాటికి తాను చేసిన పుషప్స్ ఎంతో ఉపయోగపడ్డాయని ఆమె చెప్పారు. ఇదంతా విని ఆమె డెడికేషన్ కు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
