Begin typing your search above and press return to search.

దిల్ రాజును కలిసిన శ్రీతేజ్ తండ్రి.. అదనపు సహాయానికి హామీ..

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు.. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద అనుకోని సంఘటన.. పుష్ప 2: ది రూల్ మూవీ ప్రీమియర్ వేసేందుకు సిద్ధం చేస్తుండగా.. థియేటర్ వెలుపల తొక్కిసలాట జరిగింది.

By:  M Prashanth   |   4 Dec 2025 6:24 PM IST
దిల్ రాజును కలిసిన శ్రీతేజ్ తండ్రి.. అదనపు సహాయానికి హామీ..
X

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు.. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద అనుకోని సంఘటన.. పుష్ప 2: ది రూల్ మూవీ ప్రీమియర్ వేసేందుకు సిద్ధం చేస్తుండగా.. థియేటర్ వెలుపల తొక్కిసలాట జరిగింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కానీ అప్పటికే ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే అతడిని ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అత్యున్నత చికిత్స అందించిన వైద్యులు.. ఐదు నెలల క్రితం డిశ్చార్జ్ చేశారు. రీహాబిలిటేషన్ సెంటర్ లో ట్రీట్మెంట్ అందించామని సజెస్ట్ చేశారు. దీంతో అప్పటి నుంచి బాలుడికి అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే అన్ని ఖర్చులు కలిపి నెలకు రూ.1.50 లక్షలు అవుతుందని ఇప్పటికే శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్పారు.

అల్లు అర్జున్ డిపాజిట్ చేసిన రూ.2 కోట్ల నుంచి వస్తున్న వడ్డీ డబ్బులతో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. అయితే శ్రీతేజ్ ఆరోగ్యంగా కోలుకోవటానికి కావాల్సిన అదనపు సహాయం కోసం నిర్మాత దిల్ రాజును ఆయన కలిశారు. ఆ సమయంలో దిల్ రాజు.. ఇంకా కొన్ని నెలలపాటు చికిత్స అందించమని హామీ ఇచ్చారు. శ్రీతేజ్ అప్పటికన్నా మెల్ల మెల్లగా రికవర్ అవుతున్నట్లు చెప్పారు.

"గత ఏడాది జరిగిన ఘటన అందరికీ గుర్తుంది. భాస్కర్ అబ్బాయి శ్రీతేజ్ రికవర్ అవుతున్నాడు. కాస్త బెటర్ అవుతున్నాడు. నేను అప్పుడు భాస్కర్ ప్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా రూ.2 కోట్లు డిపాజిట్ చేయించాను. ఆ డిపాజిట్ కు వచ్చే డబ్బులు వాళ్ల ఖర్చులకు.. ఆస్పత్రులకు ఉపయోగపడేలా చేశాం. నెలకు రూ.75 వేలు వడ్డీ రూపంలో వచ్చేలా ప్లాన్ చేశాం. ఇంకా బ్యాలెన్స్ ఎమోంట్ ఏటా బాబుకు, వాళ్ల ఫ్యామిలీకి యాడ్ అయ్యేలా చేశాం" అని దిల్ రాజు తెలిపారు.

"శ్రీతేజ్ కాస్త రికవర్ అవుతున్నాడు. ఆస్పత్రికి అప్పుడు రూ.70 లక్షలు అయ్యాయి. అల్లు అర్జున్, అరవింద్ గారే మొత్తం ఖర్చు పెట్టారు. కానీ ఘటన జరిగి ఏడాది అయింది. ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని భాస్కర్ కోరుతున్నారు. దానిపై అరువింద్ గారు, బన్నీతో మాట్లాడి చేయిస్తా" అంటూ హామీ ఇచ్చారు.

ఆ తర్వాత శ్రీతేజ్ తండ్రి మాట్లాడారు. "ఘటన జరిగి రెండో రోజు నుంచి ఏ సపోర్ట్ కోరుకుంటున్నామో.. అది నిరంతరం అందుతోంది. అల్లు అర్జున్ సర్.. అరవింద్ సర్ మద్దతు ఇస్తున్నారు. నేనిప్పుడు అడుగుతున్న ఎక్స్ ట్రా సపోర్ట్.. దిల్ రాజు గారికి గత వారం ఎక్స్ప్రైన్ చేశాను. రీహెబిలేటిషేన్ సెంటర్ లో ఇంకా కంటిన్యూ చేస్తానని చెప్పాను. ఇంకా సపోర్ట్ కావాలని అల్లు అర్జున్ సర్ తో సపోర్ట్ ఇప్పించాలని రిక్వెస్ట్ చేశా" అని భాస్కర్ తెలిపారు.

"దీంతో మాట్లాడతానని దిల్ రాజు హామీ ఇచ్చారు. ఆరు నెలల వరకు అల్లు అర్జున్ గారు అన్ని ఖర్చులు పెట్టి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతా అన్నారు. ఇప్పుడు ఆయన ఓకే అయినట్లు చెప్పారు. ఇదే చికిత్స అయితే కంటిన్యూ చేస్తే శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుందని వైద్యులు చెప్పారు. అందుకే మద్దతు కోరాను" అని చెప్పారు. అయితే ఆరు నెలలు కాకపోతే మరో ఏడాది అయినా చికిత్స ఇప్పించు అని, సపోర్ట్ గా ఉంటామని దిల్ రాజు హామీ ఇచ్చారు.