నితిన్ అవుట్.. మరో టాలెంటెడ్ హీరోతో శ్రీను వైట్ల
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల ఇప్పుడు అనుకున్న స్థాయి సక్సెస్ ను అందుకోలేకపోతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 15 Oct 2025 12:22 PM ISTఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల ఇప్పుడు అనుకున్న స్థాయి సక్సెస్ ను అందుకోలేకపోతున్నారు. ఆగడు నుంచి శ్రీను వైట్ల తన ఫామ్ ను పూర్తిగా కోల్పోయారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అవేవీ అతనికి కంబ్యాక్ ను తెచ్చిపెట్టలేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమా వర్కవుట్ అవుతుందని చేయడం, దాంతో నిరాశ పడటమే అవుతుంది తప్పించి హిట్ మాత్రం అందని ద్రాక్షలానే మిగిలింది.
నితిన్ తో సినిమా చేద్దామని ప్రయత్నాలు
కానీ రీసెంట్ గా వచ్చిన విశ్వం మూవీతో కొంచెం పర్లేదని ప్రూవ్ చేసుకున్న శ్రీను వైట్ల, తన వద్ద సరైన రైటింగ్ టీమ్ ఉంటే మళ్లీ మంచి కంబ్యాక్ ఇచ్చే ఛాన్సుంది. ఈ నేపథ్యంలోనే శ్రీను వైట్ల సామజవరగమన రైటర్ నందు రాసిన ఓ కథతో సినిమా చేయాలని చూస్తున్నారు. నందు రాసిన కథతో శ్రీను వైట్ల, యంగ్ హీరో నితిన్ వద్దకు వెళ్లగా నితిన్ కూడా ఓకే చెప్పారని మొన్నామధ్య వార్తలొచ్చాయి.
నితిన్ నుంచి శర్వా చేతికి
నితిన్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమా ఓకే అయిందని, ఈ కాంబినేషన్ లో సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల నితిన్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా, ఇప్పుడదే కథను శర్వానంద్ తో చేయాలని శ్రీను వైట్ల ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే శ్రీను వైట్ల, శర్వాకు కథ చెప్పగా, టాలెంటెడ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
శర్వానంద్ ఓకే అనడంతో శ్రీను వైట్ల మరియు అతని టీమ్ మిగిలిన విషయాలను ఫైనల్ చేయడంలో బిజీ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీని కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలే నిర్మిస్తారని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందని, వచ్చే ఏడాది మొదట్లో మూవీ సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. శ్రీను వైట్ల ఫామ్ లో లేకపోయినా శర్వానంద్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం అతను చెప్పిన కథేనని సమాచారం. ఇక శర్వా విషయానికొస్తే అతను ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నారీ నారీ నడుమ మురారి సినిమాను పండగ బరిలో దింపుతున్న శర్వా చేతిలో అది కాకుండా మరో రెండు సినిమాలున్నాయి. మరి శ్రీను వైట్ల సినిమాను శర్వానంద్ వాటి తర్వాత చేస్తారా లేదా వాటితో పాటే ఈ సినిమాను కూడా సమాంతరంగా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
