Begin typing your search above and press return to search.

శ్రీనివాస మంగాపురం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

దివంగత సినీ నటులు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా, దివంగత నటుడు రమేష్ బాబు కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఘట్టమనేని వారసుడు జయకృష్ణ.

By:  Madhu Reddy   |   2 Aug 2026 1:48 PM IST
శ్రీనివాస మంగాపురం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!
X

దివంగత సినీ నటులు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా, దివంగత నటుడు రమేష్ బాబు కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఘట్టమనేని వారసుడు జయకృష్ణ.ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీనివాస మంగాపురం అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ వారసురాలు హీరోయిన్ గా ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఎవరికి?

అలా జయకృష్ణ హీరోగా థియేటర్లలోకి వచ్చిన ఈ శ్రీనివాస మంగాపురం సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. శ్రీనివాస మంగాపురం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ మేరకు చిత్ర బృందం ఒప్పందం ప్రకారం థియేటర్ లలో ప్రదర్శన పూర్తయిన తర్వాత ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరొకవైపు వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఆగస్టు చివరి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ సమర్పణలో.. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మించారు.

శ్రీనివాస మంగాపురం సినిమా స్టోరీ..

శ్రీనివాస మంగాపురం సినిమా స్టోరీ విషయానికి వస్తే.. పెద్దిరెడ్డి తిరుపతిలో మంచి పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి. తన ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా ప్రజలు భయపడేవారు. అలాంటి వ్యక్తి కూతురు మంగ(రాషా తడానీ)ను అప్పుడే తిరుపతికి కొత్తగా వచ్చిన శ్రీనివాస్ (జయకృష్ణ) తొలిచూపులోనే ప్రేమిస్తాడు. జులాయిగా తిరిగే స్వతంత్ర బాబు (నరేష్) తో స్నేహం ఏర్పరచుకొని, మంగ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మంగ మాత్రం అతడిని పట్టించుకోదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. ఇంతలోనే మంగకి ఇంకో వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అయినా తన ప్రేమ విషయాన్ని మంగతో పంచుకుంటాడు శ్రీనివాస్.ఆమె ఒప్పుకోదు. చివరికి ఏం జరిగింది? శ్రీనివాస ఎవరు? తిరుపతికి ఎందుకు వచ్చాడు? నిజంగానే మంగతో తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడా? లేక ఆమెను ప్రేమలో పడేయడం వెనుక ఏదైనా కారణం ఉందా? ఇందులో బళ్లారి డాన్ వెంకటప్ప నాయుడు అలియాస్ మోహన్ బాబుతో శ్రీనివాస్ కి ఉన్న సంబంధం ఏమిటి? మంగా ప్రేమ కోసం శ్రీనివాస్ ఏం చేశాడు? మంగతో శ్రీనివాస్ ప్రేమను మంగా తండ్రి పెద్దిరెడ్డి ఒప్పుకున్నాడా? చివరికి వీరి కథ సుఖాంతం అయ్యిందా? అనేది తెరపై చూడాల్సిందే.