Begin typing your search above and press return to search.

'మంగాపురం'పై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?

ముఖ్యంగా ఘట్టమనేని కుటుంబం నుంచి జయకృష్ణ హీరోగా పరిచయం అవుతుండటం, దర్శకుడు అజయ్ భూపతి ఆ ప్రాజెక్టును తెరకెక్కించడం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

By:  M Prashanth   |   26 July 2026 11:45 AM IST
మంగాపురంపై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?
X

జూలై నెల టాలీవుడ్‌ కు ఊహించని విజయాలను అందించింది. చిన్న సినిమాలు పెద్ద ఫలితాలు సాధిస్తే, కొత్త హీరోలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరేందుకు సిద్ధమవుతోంది శ్రీనివాస మంగాపురం. జూలై 30న విడుదల కానున్న ఆ మూవీపై ఇప్పటికే సోషల్ మీడీయాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఘట్టమనేని కుటుంబం నుంచి జయకృష్ణ హీరోగా పరిచయం అవుతుండటం, దర్శకుడు అజయ్ భూపతి ఆ ప్రాజెక్టును తెరకెక్కించడం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

ఇటీవల విడుదలైన మా ఇంటి బంగారం, లెనిన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్స్ సాధించాయి. ఈ వారం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. దీంతో టాలీవుడ్‌ లో ప్రస్తుతం కొత్త కథలు, కొత్త ఫేసెస్ కు ప్రేక్షకులు పెద్దపీట వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో శ్రీనివాస మంగాపురం ప్రేక్షకుల ముందుకు రావడం విశేషంగా మారింది.

ఆ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ దర్శకుడు అజయ్ భూపతి. RX 100 మూవీతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తర్వాత కూడా విభిన్న కథలను ఎంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఓ కొత్త హీరోతో లవ్ స్టోరీని తెరకెక్కించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజయ్ భూపతి మార్క్ ఎమోషన్స్, ఇంటెన్స్ సన్నివేశాలు ఈ చిత్రంలో కూడా కనిపిస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

జయకృష్ణకు ఇది తొలి చిత్రం కావడం మరో విశేషం. దివంగత నటుడు కృష్ణ మనవడిగా, యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రమేష్ బాబు కొడుకుగా ఆయనకు ఇప్పటికే గుర్తింపు ఉంది. మహేష్ బాబు అన్నయ్య కొడుకు అవ్వడం మరో ప్లస్. అయితే, స్టార్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఒక్కటే విజయానికి సరిపోదని గతంలో అనేక ఎగ్జాంపుల్స్ నిరూపించాయి. ప్రేక్షకులను మెప్పించే కథ, యాక్టింగ్, ఎమోషన్స్ చివరికి సినిమాను నిలబెడతాయి. అందుకే శ్రీనివాస మంగాపురం విషయంలో అందరి ఫోకస్ కంటెంట్‌ పైనే ఉందని చెప్పాలి.

ఇక హీరోయిన్ రాషా థడానీ కూడా సినిమాకు మరో అట్రాక్షన్. యూత్ ను ఆకట్టుకునే జంటగా జయకృష్ణ- రాషా కనిపిస్తున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటల ద్వారా అర్థమవుతోంది. మరోవైపు ప్రముఖ నిర్మాతలు జెమినీ కిరణ్, అశ్వినీ దత్ అండగా నిలవడం ఇప్పటికే చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు జులై నెలలో చిన్న సినిమాలు చూపించిన మ్యాజిక్‌ ను శ్రీనివాస మంగాపురం కూడా కొనసాగిస్తుందా? అజయ్ భూపతి మరోసారి తన మార్క్ చూపిస్తారా? కొత్త హీరోగా జయకృష్ణ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరో నాలుగు రోజుల్లో ఆ ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. అయితే విడుదలకు ముందే శ్రీనివాస మంగాపురంపై ఇండస్ట్రీ ఫోకస్ పడిందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఘట్టమనేని ఫ్యామిలీ సపోర్ట్, స్టార్ బ్యానర్ల మద్దతు అవసరమైన చివరకు డిసైడ్ చేసేది కంటెంట్ మాత్రమే అని చెప్పాలి. మరి జూలై చివరిలో ఆ మూవీ నిజంగానే సర్ప్రైజ్ ప్యాకేజ్‌ గా నిలుస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.