Begin typing your search above and press return to search.

క‌క్క‌లేక..మింగ‌లేక మ‌ధ్య‌లో న‌లిగిపోతుందా!

కానీ శ్రీనిధి శెట్టి మాత్రం తానో కాదో? అన్న‌ట్లు ద్వంద వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తుంది. మ‌రి ఈ విష‌యంలో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కూడా ఇంకా క్లారిటీకి రాన‌ట్లే క‌నిపిస్తోంది.

By:  Srikanth Kontham   |   10 Oct 2025 3:54 PM IST
క‌క్క‌లేక..మింగ‌లేక మ‌ధ్య‌లో న‌లిగిపోతుందా!
X

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేదు. ప‌లువురు హీరోయిన్ల ప‌రిశీల అనంత‌రం క‌న్న‌డ బ్యూటీ శ్రీనిధి శెట్టిని తీసుకున్న‌ట్లు బ‌ల‌మైన ప్ర‌చారం సాగింది. ప‌రిశీల‌న‌లో ఉన్న శ్రీనిధిశెట్టినే తీసుకున్నార‌ని గ‌ట్టి ప్చారం జ‌రుగుతోంది. ఇదే విష‌యాన్ని శ్రీనిధి ముందుకు తీసుకెళ్తే కొన్ని గంట‌ల ముందు త‌న‌కి అలాంటి అవ‌కాం రాలేద‌ని చెప్పుకొచ్చింది. కానీ రాత్రికి రాత్రే సీన్ మారిన‌ట్లు తాను ఆ సినిమాలో ఉన్నానో? లేదో? నిర్మాత‌లే ప్ర‌క‌టిస్తారంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకుంది.

ఎటూ తేల్చుకోలేని స్థితిలో న‌టి:

దీంతో సినిమాలో తానే హీరోయిన్ కాక‌పోతే ఆ మాట ఎందుకంటుందంటూ మీడియా కోడై కూస్తుంది. ఈ విష‌యంలో శ్రీనిధి శెట్టి క‌క్క‌లేక‌..మింగ‌లేని స్థితిలో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. తానే హీరోయిన్ కాక‌పోతే క‌రాఖండీగా ఖండించి తాను హీరోయిన్ కాదు అనేసిది. కానీ ఇప్పుడా మాట అన‌లేక‌పోతుంది. అలాగ‌ని తానే హీరోయిన్ అని క‌న్ప‌మ్ చేయ‌లేక‌పోతుంది. సాధార‌ణంగా ఏ సినిమాకైనా ఫ‌లానా హీరోయిన్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న స‌మ‌యంలో ఏ న‌టి క‌న్ప‌మ్ చేయ‌లేదు. ఒక‌వేళ తానే హీరోయిన్ అయినా? కొంత మంది నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కూ చెప్పుకోరు.

మేక‌ర్స్ అధికారికం చేసేదెప్పుడు?

కానీ శ్రీనిధి శెట్టి మాత్రం తానో కాదో? అన్న‌ట్లు ద్వంద వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తుంది. మ‌రి ఈ విష‌యంలో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కూడా ఇంకా క్లారిటీకి రాన‌ట్లే క‌నిపిస్తోంది. సినిమా ఇప్ప‌టికే ప్రారంభోత్స‌వ‌మైంది. రెగ్యుల‌ర్ షూటింగ్ కి స‌న్నాహాలు చేస్తున్నారు. రేపోమాపో సెట్స్ కు వెళ్లే అవ‌కాశం ఉంది. ఈలోగా హీరోయిన్ విష‌యంలో మేక‌ర్స్ అధికారికంగా చెబుతారా? లేక సెట్స్ కు వెళ్లిన త‌ర్వాత అక్క‌డ నుంచి రివీల్ చేస్తారా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం నిధి శెట్టి మాత్రం `తెలుసు క‌దా` అనే మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముంద‌కు రావ‌డానికి రెడీ అవుతోంది.

స్థిర‌మైన స్థానం కోసం:

మ‌రో వారం రోజుల్లో ఆ సినిమా రిలీజ్ కు ఉండ‌టంతో శ్రీనిధి శెట్టి ఆ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. ఈ సినిమా విజ‌యంతో టాలీవుడ్ లో స్థిర మైన స్థానం సంపాదించుకోవాల‌ని ఆశిస్తుంది. ఇప్ప‌టికే `హిట్ 3` తో మంచి విజ‌యం అందుకున్న నేప‌థ్యంలో `తెలుసు క‌దా` తో మ‌రో హిట్ అందుకుంటే? కెరీర్ ప‌రంగా క‌లిసొస్తుంది అన్న ఆశ‌తో ఎదురు చూస్తోంది. ఇంత‌లోనే గురూజీ సినిమాలో భాగ‌మ‌య్యే వార్త అమ్మ‌డికి మంచి ప‌బ్లిసిటీ తెచ్చి పెడుతుంది.