Begin typing your search above and press return to search.

శ్రీనిధి కెరీర్లో నే మొద‌టిసారి అలాంటి సినిమా

మామూలుగా ఏ యాక్ట‌ర్ కి అయినా మొద‌టి సినిమాతోనే మంచి హిట్ అందుకుని కెరీర్ స్టార్టింగ్ నుంచే మంచి అవ‌కాశాలను అందుకుంటూ కెరీర్లో ముందుకెళ్లాల‌ని అనుకుంటూ ఉంటారు

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Oct 2025 1:54 PM IST
శ్రీనిధి కెరీర్లో నే మొద‌టిసారి అలాంటి సినిమా
X

మామూలుగా ఏ యాక్ట‌ర్ కి అయినా మొద‌టి సినిమాతోనే మంచి హిట్ అందుకుని కెరీర్ స్టార్టింగ్ నుంచే మంచి అవ‌కాశాలను అందుకుంటూ కెరీర్లో ముందుకెళ్లాల‌ని అనుకుంటూ ఉంటారు. అయితే ఎవ‌రికైనా అనుకోవ‌డం వ‌ర‌కే వారి చేతుల్లో ఉంటుంది. అది అవ‌డం అవ‌క‌పోవ‌డం విధి లిఖితం. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకునే అదృష్టం చాలా త‌క్కువ మందికే ఉంటుంది.

కెజిఎఫ్ తో న‌టిగా మంచి గుర్తింపు

అందులో శ్రీనిధి శెట్టి కూడా ఒక‌రు. కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల‌తో ఎవ‌రూ ఊహించ‌ని డెబ్యూని అందుకున్నారు శ్రీనిధి. మోడ‌లింగ్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీనిధి, ఆ త‌ర్వాత 2018లో కెజిఎఫ్ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కెజిఎఫ్, కెజిఎఫ్2 సినిమాల్లో శ్రీనిధి న‌ట‌న‌కు ఎంతో మంది ముగ్దుల‌య్యారు. ఆ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని తో క‌లిసి హిట్3 సినిమా చేశారు శ్రీనిధి.

అక్టోబ‌ర్ 17న తెలుసు క‌దా..

హిట్ 3 త‌ర్వాత శ్రీనిధి నుంచి టాలీవుడ్ లో వ‌స్తోన్న సినిమా తెలుసు క‌దా. స్టార్ బాయ్ సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా రాశీఖ‌న్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా తెర‌కెక్కిన సినిమా తెలుసు క‌దా. కాస్ట్యూమ్ డిజైన‌ర్ నీర‌జ కోన ద‌ర్శ‌కురాలిగా మారి చేస్తున్న మొద‌టి సినిమా ఇది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న తెలుసు క‌దా, అక్టోబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సంద‌ర్భంగా తెలుసు క‌దా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్న శ్రీనిధి, ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్నారు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో శ్రీనిధి మాట్లాడుతూ, మామూలుగా అంద‌రూ రొమాంటిక్ కామెడీ సినిమాలు చేసి ఆ త‌ర్వాత యాక్ష‌న్ వైపు వెళ్తార‌ని, కానీ తాను మాత్రం యాక్ష‌న్ నుంచి రొమాంటిక్ కామెడీల వైపు వ‌చ్చాన‌ని, త‌న కెరీర్లోనే ఫ‌స్ట్ టైమ్ స్టంట్ మాస్ట‌ర్, బ్ల‌డ్ లేని సినిమా చేశాన‌ని శ్రీనిధి పేర్కొన్నారు. అమ్మడు చెప్పిన‌ట్టు శ్రీనిధి గ‌తంలో చేసిన కెజిఎఫ్, కెజిఎఫ్2 మ‌రియు హిట్3 సినిమాల్లో నెక్ట్స్ లెవెల్ వ‌యొలెన్స్, ర‌క్త‌పాతం ఉంటాయి. కానీ తెలుసు క‌దా సినిమా దానికి భిన్నంగా ఉంటుంది. మ‌రి తెలుసు క‌దా ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందో చూడాలి.