Begin typing your search above and press return to search.

ఐదు ల‌క్ష‌లు కాదు 200 రూపాయ‌ల పుడ్ చాలు!

డిజైన‌ర్ దుస్తులు..ఖ‌రీదైన బంగ్లాలు.. ఖ‌రీదైన కార్లు ఇలా ఒక‌టేంటి? తినే తిండి ద‌గ్గ‌ర నుంచి ప‌డుకునే మంచం వ‌ర‌కూ ప్ర‌తీది బ్రాండ్ అయి ఉండాలి

By:  Srikanth Kontham   |   6 Oct 2025 10:00 PM IST
ఐదు ల‌క్ష‌లు కాదు 200 రూపాయ‌ల పుడ్ చాలు!
X

సెల‌బ్రిటీ జీవితమంటే ఎంతో ఖ‌రీదైంది. డిజైన‌ర్ దుస్తులు..ఖ‌రీదైన బంగ్లాలు.. ఖ‌రీదైన కార్లు ఇలా ఒక‌టేంటి? తినే తిండి ద‌గ్గ‌ర నుంచి ప‌డుకునే మంచం వ‌ర‌కూ ప్ర‌తీది బ్రాండ్ అయి ఉండాలి. అవి ఎంతో సౌక‌ర్య వంతంగా ఉండాలి. ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్ అన్న‌ది వారి జీవితాల్లో ఓ భాగంగా క‌నిపిస్తుంది. సెల‌బ్రిటీ పేరు ఎత్త‌గానే సామాన్యుడికి గుర్తొచ్చేది ఇదే. కానీ కొంద‌రు సెల‌బ్రిటీలు మాత్రం ఎంతో డౌన్ టూ ఎర్త్ ఉంటారు. ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్ ని ఎంత మాత్రం ఇష్ట‌ప‌డారు. వీలైనంత సింపుల్ గా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు.

పాన్ ఇండియా బ్యూటీ ఇంత సింపుల్ గానా:

అలాంటి వాళ్ల‌లో తాను ఒక‌రిని అంటోంది క‌న్న‌డ బ్యూటీ శ్రీనిధి శెట్టి. `కేజీఎఫ్` తో పాన్ ఇండియా హిట్ అందుకున్న బ్యూటీ తెలుగులో నాని `హిట్-3` తో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈసినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో కొత్త అవ‌కాశాలు బాగానే అందుకుంటుంది. తాజాగీ శ్రీనిధి శెట్టి ఎంత సింపుల్ గా ఉంటుంది? అన్న‌ది వివ‌రించింది. త‌న నెల‌వారీ ఖ‌ర్చులు ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటాయా? అని ప్ర‌శ్నిస్తే? అంతా అంటూ నోరెళ్ల‌బెట్టింది. తాను స్విగ్గీ..జోమోటోలో ఆర్డ‌ర్ చేసే పుడ్ ఖ‌రీదు 200 రూపాయ‌లు ఉంటే చాలు అంటుంది.

5 ఏళ్ల క్రితం జాకెట్ ఇప్ప‌టికీ వాడుతున్నా:

స్టార్ హోట‌ల్ భోజన‌మే త‌న‌కు అవ‌స‌రం లేద‌ని తెలిపింది. తాను ఆర్డర్ పెట్టుకుంటే గ‌నుక సింపుల్ బౌల్ లో పుడ్ అది 200 రూపాయ‌లది అయితే చాలంది. బ‌య‌ట‌కు వెళ్లాలంటే ఖ‌రీదైన కార్లు కూడా అవ‌స‌రం లేదంది. ఊబ‌ర్..వోలా కార్లు బుక్ చేసుకుని బ‌య‌ట‌కు వెళ్లిపోతానంది. దుస్తుల విష‌యానికి వ‌స్తే వంద‌ల జ‌త‌లు అవ‌స‌రం లేదంది. మంచి దుస్తులు కొన్ని కొనుకుంటుందిట‌. వాటినే జాగ్ర‌త్త‌గా వాడుకుంటుందిట‌. ఐదేళ్ల క్రితం కొన్న జాకెట్ ఇప్ప‌టికీ వాడుతున్న‌ట్లు తెలిపింది. ఒక‌సారి వేసిన దుస్తులు మ‌ళ్లీ వేయ‌కూడ‌ద‌నే రూల్ తానెప్పుడు పెట్టుకో లేద‌ని...ఆ డ్రెస్ నీట్ గా ఉన్నంత కాలం వాడుతానంది.

ఇలా ఉండ‌ట‌మే త‌న‌కు ఇష్ట‌మ‌ని తెలిపింది. చేతిలో డ‌బ్బుల‌న్నాయని దుబారా ఖ‌ర్చు చేయ‌నంది. తాను సింపుల్ కుటుంబం నుంచి వచ్చాన‌ని...ఇద్ద‌రు అక్కలు కూడా ఉన్న‌ట్లు తెలిపింది. అలాగే త‌న‌కు ఇష్ట‌మైన న‌టీమ‌ణుల్లో అనుష్క శెట్టి ఒక‌రంది. తాను కూడా చాలా సింపుల్ గా ఉంటుందంది. అనుష్క‌లో డౌన్ టూ ఎర్త్ క్వాలిటీ త‌న‌కు ఎంత‌గానో న‌చ్చుతుంద‌ని శ్రీనిధి శెట్టి తెలిపింది. ఈ బ్యూటీ న‌టించిన `తెలుసు క‌దా` చిత్రం ఈనెల‌లోనే రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.