స్టార్ హీరోయిన్ సింపుల్ లైఫ్ తెలిస్తే షాక్!
హీరోయిన్లు అంటే తెర మీదనే కాదు తెర వెనుక కూడా అంతే స్టైలిష్ గా కనిపిస్తుంటారు.
By: Srikanth Kontham | 30 Sept 2025 9:00 PM ISTహీరోయిన్లు అంటే తెర మీదనే కాదు తెర వెనుక కూడా అంతే స్టైలిష్ గా కనిపిస్తుంటారు. డిజైనర్ దుస్తుల్లో తళుక్కున మెరుస్తుంటారు. చిట్టిపొట్టి దుస్తుల్లో కుర్రకారును అలరిస్తుంటారు. వెకేషన్ లో టూపీస్..బికినీలు ధరించి ఆ ఫోటోలు నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. తాము ఎంజాయ్ చేసే ప్రతీ మూవ్ మెంట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. ప్రత్యేకించి గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్ అంటే అందంగా కనిపించాలి. గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అవసరమైన చోట యాటిట్యూడ్ సైతం చూపిస్తుంటారు.
వచ్చిన అవకాశాలు వదులుకున్నా:
కానీ కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి మాత్రం ఇలాంటి వాళ్లకు భిన్నం అంటోంది. తానో సింపుల్ గాళ్ గా పేర్కోంది. `కేజీఎఫ్` తో ఈ బ్యూటీ పరిచయమైన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన `హిట్ 3` తో తెలుగులోనూ అడుగు పెట్టింది. `కేజీఎఫ్` తర్వాత నటిగా అవకాశాలు అందుకోవడంలో విఫలమైంది? అన్న విషయాన్ని అమ్మడు ఖండించింది. `కేజీఎఫ్` తర్వాత వచ్చిన అవకాశాలు తానే వదులుకున్నట్లు తెలిపింది. కేవలం నచ్చిన పాత్రలు మాత్రమే చేసానంది.
సామాన్య జీవితమే ఇష్టం:
వదులకున్న పాత్రలేవైనా ఉన్నాయి? అంటే అవి తన మనసుకు నచ్చినవి కాదని తెలిపింది. తాను ఓ నటిని అయినా చుట్టూ ఉన్న వారు తనని గుర్తు పట్టినా? తనకు సింపుల్ నలుగురితో పాటు కలిసి ఉండటమే ఎంతో ఇష్టమంది. బయటకు వెళ్లాలంటే ప్రత్యేకమైన కారు అవసరం లేదు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతానంది. సూపర్ మార్కెట్ కి వెళ్లి తానే ఇంటికి కావాల్సిన సరుకులన్నింటిని కొని తెస్తానంది. రోడ్డు పక్కన పానీపూరీ కూడా తీనేస్తానంది. హీరోయిన్ అంటే ఫలానా విధంగానే ఉండాలని తాను ఎలాంటి గీతలు గీసుకోలేదంది.
కష్టాలు తెలిసిన నటి:
చదువుకునే రోజుల్లో ఎలా ఉండేదాన్నో? హీరోయిన్ అయినా అలాగే ఉన్నట్లు..అలాగే జీవిస్తున్నట్లు తెలిపింది. అయితే బయటకు వెళ్లిన సమయంలో అక్కడ ఎవరైనా గుర్తుపట్టే అవకాశం ఉంటుందనుకుంటే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటానంది. తాను ఇలా ఉండటానికి కారణం తాను పెరిగిన వాతావరణం అలాందని తెలిపింది. ఇంట్లో ముగ్గురు ఆడ పల్లలు ఉండటం...పదవ తరగతి చదువుతోన్న సమయంలో తల్లి చనిపోవడం. ఆ ఇబ్బందులు కష్టాలు అన్నీ తెలుసునంది. నాన్న కష్టాలు చూసిన దాన్ని. ఇవన్నీ తెలుసు కాబట్టే నటిగా బ్యాలెన్స్ గా ప్రయాణం సాగిస్తున్నట్లు తెలిపింది.
