సక్సెస్ అయితే సీనియర్లకు మంచి ఆప్షనే!
సీనియర్ హీరోలకు హీరోయిన్లు ఎంపిక అన్నది ఎంత కష్టంగా మారుతుందో చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 31 Oct 2025 3:00 PM ISTసీనియర్ హీరోలకు హీరోయిన్లు ఎంపిక అన్నది ఎంత కష్టంగా మారుతుందో చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్లకు హీరోయిన్లు సెట్ చేయడం ప్రతీసారి సమస్యగా మారుతోంది. దీంతో తీసుకున్న వారినే మళ్లీ మళ్లీ తీసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో నయనతార, త్రిషలనే రిపీట్ చేయాల్సిన సన్నివేశం ప్రతీసారి కనిపిస్తోంది. అనుష్క లాంటి 40 ఏళ్లు దాటి నటి ఉన్నా? దర్శకులు ఎందుకనో ఆమెవైపు చూడటం లేదు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సీరియర్లకు సై అంటున్నా? ఆమెని కూడా అశ్రద్ద చేస్తున్నారు.
కన్నడిగి మరో ఆప్షన్ గా:
తప్పదు అనుకుంటే? తప్ప మిల్కీ వైపు ఎవరూ వెళ్లడం లేదు. ఆమెను ఓ ఐటం భామగానే పరిమితం చేస్తున్నారు.
ఆషీకా రంగనాధ్, సంయుక్తా మీనన్ లాంటి వారు మరిన్ని సక్సస్ లు అందుకుంటే? సీనియర్లకు సరితూగుతారు. ప్రస్తుతం ఈ భామలు సీనియర్లతో కొన్ని సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్ల సరసన చేరడా నికి కన్నడిగి శ్రీనిధి శెట్టి కూడా సిద్దంగా ఉంది. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఏరికోరి మరీ ఎంపిక చేసారు:
గురూజీ చాలా మంది భామల్ని పరిశీలించి చివరిగా ఆ ఛాన్స్ శెట్టి బ్యూటీకి ఇచ్చారు. ఈ బ్యూటీ తెలుగింట ఇప్పుడి ప్పుడే ఫేమస్ అవుతుంది. ఇటీవల రిలీజ్ అయిన `హిట్ 3` తో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు కూడా అందాల ఆరబోత కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే చేస్తుంది. గురూజీ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్ద పీట వేస్తారు. హీరోకు ధీటుగా హీరోయిన్ పాత్రలను డిజైన్ చేస్తారు. శ్రీనిధి పెర్పార్మర్ కావడంతో ఏరికోరి మరీ ఎంపిక చేసారు. ఆయన చేతుల్లో పడ్డ హీరోయిన్లు కూడా వెలుగులోకి వచ్చారు.
గ్లామర్ పాత్రలకు నో:
ఈ సినిమా హిట్ అయితే గనుక శ్రీనిధికి మంచి పేరు వస్తుంది. అవకాశాలు పెరుగుతాయి. యువ హీరోలతో పాటు, సీనియర్ హీరోలకు శ్రీనిధి మంచి ఆప్షన్ గా మారుతుంది. కెరీర్ పరంగా శ్రీనిధి గురూజీ ఇచ్చిన అవకాశాన్ని గొప్పగా భావిస్తోంది. ఇతర భాషల్లో కొన్ని చిత్రాల్లో గ్లామర్ పాత్రల్లో నటించాలని చాలా అవకాశాలు వచ్చినా? శ్రీనిధి వాటిని సున్నితంగా తిరస్కరించింది. ప్రస్తుతం తెలుగు సినిమాలపై దృష్టి పెట్టి పని చేస్తోంది.
