ఆ స్టార్ హీరోయిన్ ని లేడీ ప్రభాస్ అంటారట.. ఎందుకు..?
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ పాన్ ఇండియా లెవెల్ లో ఉంటారు. ఐతే ప్రభాస్ సినిమాలు నేషనల్ లెవెల్ లో హంగామా చేస్తాయి. ఆయన ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు.
By: Ramesh Boddu | 4 Oct 2025 5:00 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ పాన్ ఇండియా లెవెల్ లో ఉంటారు. ఐతే ప్రభాస్ సినిమాలు నేషనల్ లెవెల్ లో హంగామా చేస్తాయి. ఆయన ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం వచ్చామా సినిమా చేశామా సైలెంట్ గా ఉన్నామా అన్నట్టు ఉంటాడు. ప్రభాస్ తన సినిమా ఈవెంట్స్ లోనే అతి కష్టం మీద మాట్లాడతాడు. తెర మీద మాస్ విధ్వంసం చూపించే ప్రభాస్ చాలా ఇంట్రావర్ట్ అన్న విషయం తెలిసిందే. మొహమాటం అయితే చాలా ఎక్కువ అని అంటుంటారు. ఐతే అలా ప్రభాస్ రియల్ క్యారెక్టర్ కి దగ్గరగా ఉంటుందట ఒక స్టార్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా.
ఆమె ఫ్రెండ్స్ అంతా ఆమెను లేడీ ప్రభాస్..
అందుకే ఆమె ఫ్రెండ్స్ అంతా ఆమెను లేడీ ప్రభాస్ అంటారట. ఇంతకీ ఏ హీరోయిన్ ని లేడీ ప్రభాస్ అని పిలుస్తారంటే ఆమె ఎవరో కాదు కె.జి.ఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి అని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకుంది శ్రీనిధి ఆ తర్వాత కోబ్రా చేసింది మిస్ ఫైర్ అయ్యింది. ఇక హిట్ 3 తో నానితో కలిసి హిట్ అందుకుంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో ఆమె చేసిన తెలుసు కదా రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రీనిధి శెట్టి తనని ఫ్రెండ్స్ అంతా లేడీ ప్రభాస్ అంటారని అన్నది. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటాను. తన ప్రపంచం తనదే అన్నట్టు ఉంటాను. ఫ్రెండ్స్ లో కూడా చాలా తక్కువ మాట్లాడతా. అందుకే అందరు ప్రభాస్ తో తనని పోల్చి లేడీ ప్రభాస్ అనేస్తారని చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి. సో శ్రీనిధి శెట్టి ఫ్రెండ్స్ లో ప్రభాస్ ఫ్యాన్స్ బాగానే ఉన్నట్టు ఉన్నారు.
ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నా ఆఫ్ స్క్రీన్ లో ఇద్దరు ఇంట్రావర్ట్..
ప్రభాస్, ఈ లేడీ ప్రభాస్ జోడీ కడితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన ఆడియన్స్ లో ఉంది. ప్రభాస్ తో ఛాన్స్ గురించి అమ్మడు ఎలా ఫీల్ అవుతుందో చూడాలి. ఐతే ఆ సినిమా ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నా ఆఫ్ స్క్రీన్ లో ఇద్దరు ఇంట్రావర్ట్ కాబట్టి సెట్ అంతా బోర్ ఉంటుందేమో చూడాలి. తెలుసు కదా హిట్ పడితే శ్రీనిధికి తెలుగులో మరిన్ని మంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
కన్నడ అమ్మాయైన శ్రీనిధి శెట్టి తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకు సూపర్ హ్యాపీగా ఉంది. ఐతే తెలుసు కదా షూటింగ్ టైం లో కూడా శ్రీనిధి సైలెంట్ నెస్ గురించి సిద్ధు తెగ ఆడేసుకున్నాడని తెలుస్తుంది.
