Begin typing your search above and press return to search.

ఆ హీరోల కోసం రెండు షిఫ్టుల్లో పని చేస్తా!

సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 17న రిలీజ్ కానుంది. తెలుసు క‌దా ప్ర‌మోష‌న్స్ లో శ్రీనిధి యాక్టివ్ గా పాల్గొంటూ ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలను వెల్ల‌డిస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 Oct 2025 8:50 AM IST
ఆ హీరోల కోసం రెండు షిఫ్టుల్లో పని చేస్తా!
X

కెజిఎఫ్1 సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన క‌న్న‌డ బ్యూటీ శ్రీనిధి శెట్టి మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఆ త‌ర్వాత కెజిఎఫ్ చాప్ట‌ర్2తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ను ఖాతాలో వేసుకుంది శ్రీనిధి. బ్యాక్ టు బ్యాక్ హిట్లు ప‌డ‌టంతో శ్రీనిధి పేరు పాన్ ఇండియా స్థాయిలో వినిపించింది. వ‌రుస హిట్లు ప‌డ‌టంతో శ్రీనిధి రేంజ్ ఎంతో పెరిగిపోతుంద‌ని అంతా అనుకున్నారు.

క్రేజ్ ను క్యాష్ చేసుకోలేక‌పోయిన శ్రీనిధి

కానీ ఆ అమ్మ‌డు ఎక్కువ సినిమాల్లో మాత్రం క‌నిపించ‌లేదు. కెజిఎఫ్ తో వ‌చ్చిన క్రేజ్ ను స‌రిగా క్యాష్ చేసుకోలేక‌పోయిందా లేదా ఆఫ‌ర్లు వ‌చ్చినా కావాల‌ని అన్నీ ఆలోచించి అడుగులు వేయాల‌నుకుందో తెలియదు కానీ ఒక్కో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటూ వ‌స్తుంది. కెజిఎఫ్2 త‌ర్వాత హిట్3 లో క‌నిపించిన శ్రీనిధి ఇప్పుడు తెలుసు క‌దా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అయింది.

అక్టోబ‌ర్ 17న తెలుసు క‌దా రిలీజ్

సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 17న రిలీజ్ కానుంది. తెలుసు క‌దా ప్ర‌మోష‌న్స్ లో శ్రీనిధి యాక్టివ్ గా పాల్గొంటూ ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలను వెల్ల‌డిస్తోంది. అందులో భాగంగానే ఒకేసారి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో వ‌ర్క్ చేసే ఛాన్స్ వ‌స్తే, ఇద్ద‌రిలో ఎవ‌రితో చేస్తార‌నే ప్ర‌శ్న ఎదురవ‌గా, దానికి అమ్మ‌డు చెప్పిన ఆన్స‌ర్ అంద‌రినీ ఎట్రాక్ట్ చేస్తుంది.

ఆఫ‌ర్ల‌ను ఎందుకు త‌క్కువ చేసుకుంటాను? ఇద్ద‌రి సినిమాల‌కీ డేట్స్ అడ్జ‌స్ట్ చేసి డే అండ్ నైట్ డ‌బుల్ కాల్షీట్స్ ఇస్తాన‌ని చెప్పింది శ్రీనిధి. ఈ స‌మాధానంతో మ‌హేష్ ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను శాటిస్‌ఫై చేసేలా ఆన్స‌ర్ ఇవ్వ‌డంతో, శ్రీనిధి చాలా తెలివైంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. వెంక‌టేష్, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కే సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్న విష‌యం నిజ‌మేనా అని అడిగితే ఆ వార్త‌ల్ని తాను కూడా విన్నాన‌ని, కానీ ఆ విష‌యం త‌న‌క్కూడా తెలియ‌ద‌ని చెప్పింది.