వెంకటరమణలో ఛాన్స్ ఇవ్వలేదా?
తాజాగా `తెలుసు కదా` ప్రమోషన్ లో ఉన్న శ్రీనిధిని మీడియా నేరుగా అడగగా అసలు విషయం చెప్పేసింది. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి తనని ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది.
By: Srikanth Kontham | 4 Oct 2025 10:58 PM ISTవిక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. వెంకటరమణ టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంకా కన్పమ్ కాలేదు. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి తీసుకున్నట్లు కొన్ని రోజులుగా నెట్టింట ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయం శ్రీనిధి దృష్టికి వెళ్లినా అమె పట్టించుకోలేదని..దీంతో ఈప్రచారమంతా నిజమేనని చర్చనీయాంశంగా మారింది.
తాజాగా `తెలుసు కదా` ప్రమోషన్ లో ఉన్న శ్రీనిధిని మీడియా నేరుగా అడగగా అసలు విషయం చెప్పేసింది. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి తనని ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇదంతా ప్రచారమని తేలిపోయింది. శ్రీనిధి శెట్టితో పాటు త్రిష, రుక్మిణీ వసంత్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ త్రిషకు మాత్రం ఛాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే వెంకటేష్ తో కలిసి సినిమాలు చేసిన నేపథ్యంలో మరోసారి ఆమె ఎంపిక కష్టమనే ప్రచారం జరుగుతోంది.
త్రిష కంటే మరో కొత్త నటి అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రుక్మిణీ వసంత్ కూడా పర్పెక్ట్ జోడీ అవుతుంది. రిషబ్ శెట్టి కి జోడీగా రీసెంట్ రిలీజ్ `కాంతార చాప్టర్ 1` లో రుక్మిణి నటించిన సంగతి తెలిసిందే. ఇందులో రిషబ్ కి పర్పెక్ట్ గా సెట్ అయింది. ఆయన వయసును మ్యాచ్ చేసింది. రిషబ్ శెట్టి వయసు 42 ఏళ్లు అయినా? 28 రుక్మిణీ మ్యాచ్ అయింది. ఈ నేపథ్యంలో వెంకీకి జోడీగానూ అన్నిరకాలుగా సరితూగుతుంది. పైగా రుక్మిణి ఇప్పుడు ట్రెండింగ్ బ్యూటీ. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది.
అలాగే మరో బ్యూటీ సంయుక్తా మీనన్ పేరు కూడా వినిపిస్తోంది. సంయుక్తా మీనన్ అంటే గురూజీకి మంచి స్నేహితు రాలు కూడా. ఆమె కెరీర్ ఆరంభంలో గురూజీ లిప్ట్ ఇవ్వడంతోనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. ఆమె లో ట్యాలెంట్ ని గుర్తించి గురూజీ ఎంకరేజ్ చేసారు. అయితే నేరుగా ఆయన సినిమాలో మాత్రం హీరోయిన్ ఛాన్స్ ఇ వ్వలేదు. ఈనేపథ్యంలో `వెంకటరమణ`లో ఛాన్స్ ఇస్తే సంయుక్త మీనన్ కు మరింత గుర్తింపు దక్కుతుంది. మరి గురూజీ మనసులో ఎవరున్నారో? తెలియాలి.
