ఇక్కడ వాళ్లు ఎలాగో శెట్టీస్ అలాగా?
కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన హీరోయిన్లు అంతా శెట్టీస్ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా కనిపిస్తారు.
By: Srikanth Kontham | 7 Oct 2025 3:00 AM ISTకర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన హీరోయిన్లు అంతా శెట్టీస్ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా కనిపిస్తారు. టాలీవుడ్ లో ఓ మూడు సామాజిక వర్గాలు ఎలా హైలైట్ అవుతాయో! శెట్టీస్ వర్గం ఇక్కడ బాగా హైలైట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో బెంగుళూరు నుంచి దిగుమతి అవుతోన్న భామల్లో వీళ్లే సక్సెస్ అవ్వడం విశేషం. అనుష్క శెట్టి కారణంగా శెట్టీస్ పదం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. కొన్నాళ్ల పాటు అనుష్క శెట్టి టాలీవుడ్ ని ఎలా ఏలిందో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఇదే శెట్టీస్ అంశాన్ని శ్రీనిధి శెట్టి ముందుకు తీసుకెళ్తే ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
మీరు శ్రీనిధి శెట్టి కదా? అనుష్క శెట్టి మీకు బంధువు అవుతుందా? అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ సామాజిక వర్గంలా తాము కూడా అక్కడ అలాగే అంది. పేరు చివరన శెట్టీ అనేది ఉంది కాబట్టి తెలిసి..తెలియని దూరపు బంధుత్వం ఎక్కడో ఉండొచ్చు అంది. రాష్ట్ర వ్యాప్తంగా శెట్టీస్ చాలా మంది ఉన్నారంది. మీరు టాలీవుడ్ లో అనుష్క లా ఫేమస్ అవుతున్నారు? అంటే అంతలేదనేసింది. నటిగా అనుష్క తనకు ఓ స్పూర్తి అంది. ఆమె లాగే తాను కూడా ఎంతో డౌన్ టూ ఎర్త్ ఉంటానంది. అనుష్కలో ఆ లక్షణం తనకు ఎంతగానో నచ్చుతుందని తెలిపింది.
అలాగే హైదరాబాద్ కి షూటింగ్ కి వస్తే నేరుగా హోటల్ లో దిగడం..మరుసటి రోజు షూటింగ్ వెళ్లడం తప్ప మరే పనులు పెట్టుకోనంది. అమ్మడికి ఇంకా ఇక్కడ బెస్ట్ ప్రెండ్స్ ఎవరూ దొరకనట్లు తెలుస్తోంది. `హిట్ 3` తోనే శ్రీనిధి టాలీవుడ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో నాని కి జోడీగా నటించింది. ఆ సినిమా మంచి విజ యం సాధించింది. దీంతో టాలీవుడ్ లో కొత్త అవకాశాలు జోరందుకున్నాయి. త్వరలో రిలీజ్ అవుతున్న `తెలుసు కదా`లో నటించింది. అలాగే కొత్త సినిమాల హీరోయిన్ రేసులోనూ అమ్మడి పేరు వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కెరీర్ ఆలస్యంగా మొదలైనా బలమైన అవకాశాల వైపు వెళ్లడం ఖాయమనే మాట వినిపిస్తోంది. కన్నడ బ్యూటీల సక్సెస్ నేపథ్యంలో? శ్రీనిధికి టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. మరి అది జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి. `కేజీఎఫ్` తో ఈ బ్యూటీ పాన్ ఇండియాకి పరిచయమైన సంగతి తెలిసిందే.
