పెళ్ళాన్ని అడిగినట్లు అడిగారు: శ్రీలీల ఫన్నీ కౌంటర్
ఆమె డైలాగ్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ చూసి అక్కడున్నవాళ్లంతా ఫుల్ గా నవ్వేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తోంది.
By: M Prashanth | 2 March 2026 7:57 PM ISTయంగ్ హీరోయిన్ శ్రీలీల అంటే సినీ ప్రేక్షకులకు మొదట గుర్తొచ్చేది డ్యాన్స్. ప్రస్తుత టాలీవుడ్ లో స్టార్ హీరోలకు సమానంగా స్టెప్పులు వేయగల హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్న వస్తే ఎక్కువ మంది చెప్పే పేరు.. శ్రీలీలనే అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అందులోనూ కమర్షియల్ మాస్ సాంగ్స్ లో ఎనర్జీ, స్పీడ్, గ్రేస్ కలిపి డ్యాన్స్ చేయడంలో శ్రీలీలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
యంగ్ హీరోలతో ఆమె చేసిన పాటలు వరుసగా చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. థియేటర్లలో ఆమె డ్యాన్స్ మొదలైతే ప్రేక్షకులు కుర్చీల్లో కూర్చోలేకపోతారనేంతగా క్రేజ్ ఏర్పడింది. కేవలం నటనతోనే కాదు, డ్యాన్స్ తోనే దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకోవడం ఆమె ప్రత్యేకతగా చెప్పాలి. సోషల్ మీడియాలో ఆమె స్టెప్పులు తరచూ వైరల్ అవుతుండటం అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
అయితే ఇప్పుడు డ్యాన్స్ విషయంలో ఓ కాలేజీ ఈవెంట్ లో శ్రీలీల చేసిన చమత్కారం నెట్టింట వైరల్ గా మారింది. కార్యక్రమానికి హాజరైన ఆమెను చూసి విద్యార్థులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే అరిచి అరిచి గొంతు పోయిందని చెప్పగా, బ్యాక్ గ్రౌండ్ లో ఓ అభిమాని 'డ్యాన్స్ చేయ్' అంటూ అరిచాడు. దానికి వెంటనే స్పందించిన శ్రీలీల 'నిజంగా పెళ్ళాన్ని అడిగినట్టే అడుగుతున్నారు' అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చింది.
ఆమె డైలాగ్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ చూసి అక్కడున్నవాళ్లంతా ఫుల్ గా నవ్వేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తోంది. శ్రీలీల సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సినిమాలతో పాటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, బ్రాండ్ ఈవెంట్స్, కాలేజీ ఫంక్షన్స్ వంటి కార్యక్రమాల్లో శ్రీలీలకు భారీ డిమాండ్ ఉంది.
ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఆమెతో సెల్ఫీలు, డ్యాన్స్ ల కోసం ఆసక్తి చూపుతున్నారు. తన ఎనర్జీ, చిరునవ్వు, సరదా మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ లలో శ్రీలీల ముందుంటుంది. తెలుగు మాత్రమే కాదు, తమిళం, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ తన రేంజ్ పెంచుకుంటోంది.
ఈ సంక్రాంతికి ఆమె నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా పరాశక్తి విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా, శ్రీలీల నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇక ఆమె అప్ కమింగ్ ప్రాజెక్టులపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి కొత్త చిత్రాలతో శ్రీలీల ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.
