Begin typing your search above and press return to search.

యంగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల నిజంగా టాలెంటెడే!

టాలీవుడ్‌లో ఉన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ల‌లో ముందు వ‌రుస‌లో నిలుస్తున్న డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల‌. లెక్క‌ల మాస్టారు సుకుమార్ వ‌ద్ద డైరెక్ష‌న్‌లో ఓన‌మాలు నేర్చుకుని తొలి ప్ర‌య‌త్నంలోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరాడు.

By:  Ravindar Gorantla   |   24 Feb 2026 11:00 PM IST
యంగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల నిజంగా టాలెంటెడే!
X

టాలీవుడ్‌లో ఉన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ల‌లో ముందు వ‌రుస‌లో నిలుస్తున్న డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల‌. లెక్క‌ల మాస్టారు సుకుమార్ వ‌ద్ద డైరెక్ష‌న్‌లో ఓన‌మాలు నేర్చుకుని తొలి ప్ర‌య‌త్నంలోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరాడు. శ్రీ‌కాంత్ ఓదెల డైరెక్ట‌ర్‌గా అరంగేట్రం చేసిన మూవీ 'ద‌స‌రా'. నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా త‌న రెగ్యుల‌ర్ మేకోవ‌ర్‌కు పూర్తి భిన్నంగా న‌టించిన మూవీ ఇది. మాసీవ్ అవ‌తార్‌లో ప‌క్కా రా అండ్ ర‌స్టిక్ క్యారెక్ట్‌లో నానిని శ్రీ‌కాంత్ ఓదెల ప్ర‌జెంట్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

ధ‌ర‌ణి క్యారెక్ట‌ర్‌లో నాని క‌నిపించిన తీరు డైరెక్ట‌ర్‌కు పూర్తి స్థాయిలో స‌రెండ‌ర్ అయిన‌ట్టుగా క‌నిపించింది. అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురిపించి నానికి కెరీర్‌లోనే ఫ‌స్ట్ వంద కోట్లు రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. ఈ మూవీ త‌రువాత మ‌రోసారి నేచుర‌ల్ స్టార్ నాని, శ్రీ‌కాంత్ ఓదెల క‌లిసి మ‌రో భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుట్టారు. అదే 'ది ప్యార‌డైజ్‌'. సుధాక‌ర్ చెరుకూరి అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

క‌లెక్ష‌న్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహ‌న్ బాబు ఇందులో క‌రుడుగ‌ట్టిన విల‌న్‌గా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్టర్‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ వీడియో రిలీజ్ త‌రువాత నాని జ‌డ‌ల్ వేసుకుని స‌రికొత్త గెట‌ప్‌లో క‌నిపించ‌డంతో అంతా అవాక్క‌య్యారు. మెయిన్ స్ట్రీమ్ హీరో జ‌డ‌లు వేసుకుని ఫైట్స్ ఎలా చేస్తాడు?..డ్యాన్సులు ఎలా చేస్తాడ‌నే కామెంట్‌లు వినిపించాయి.. అయితే వాట‌న్నింటీకి ఫ‌స్ట్ వీడియోతో చెక్ పెట్టాడు శ్రీ‌కాంత్ ఓదెల‌. ప్రేక్ష‌కుల్ని క‌న్విన్స్ చేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

శ్రీ‌కాంత్ ఓదెల విజ‌న్‌ని హీరో నాని బ‌లంగా న‌మ్మాడు. త‌న విజ‌న్ ఏంట‌న్న‌ది 'ద‌స‌రా'లో క‌నిపించింది. దాంతో ఇప్పుడు 'ది ప్యార‌డైజ్‌'తో సెకండ్‌ ఛాన్స్ ఇచ్చాడు. నాని త‌న‌పై పెట్టిన న‌మ్మ‌కాన్ని నిజం చేయ‌డానికి బ్ల‌డ్ పెట్టి ప‌ని చేస్తున్నాడు శ్రీ‌కాంత్ ఓదెల‌. ఇదే స‌మ‌యంలో నేచుర‌ల్ స్టార్ నాని ప్రేక్ష‌కుల్లో త‌న‌పై బ‌ల‌మైన న‌మ్మ‌కాన్ని బిల్డ్ చేసుకున్నాడు. మినిమ‌మ్ గ్యారంటీ హీరోగా, న‌మ్మ‌క‌మున్న నిర్మాత‌గా ఆడియ‌న్స్‌లో క్రెడిబిలిటీని బిల్డ్ చేసుకున్నాడు.

అలా ప్రేక్ష‌కుల్లో తిరుగులేని న‌మ్మ‌కాన్ని క్రియేట్ చేసుకున్న హీరో నాని ..డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల విజ‌న్ న‌చ్చి, అత‌ని మేకింగ్‌పై ఉన్న న‌మ్మ‌కంతో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశాన్ని అందించాడు. తానే స్వ‌యంగా చెరుకూరి సుధాక‌ర్‌తో క‌లిసి మెగాస్టార్ ప్రాజెక్ట్‌ని నిర్మించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఎంత బ‌లంగా శ్రీ‌కాంత్‌ని న‌మ్మ‌క‌పోతే, అత‌ని టాలెంట్‌ని గుర్తించ‌పోతే ఇలాంటి ఆఫ‌ర్ ఇస్తాడు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. నేచుర‌ల్ స్టార్ నాని, మెగాస్టార్ ఇద్ద‌రూ శ్రీ‌కాంత్‌ని న‌మ్మారంటే అత‌ను ఎంత టాలెంటెడో అర్థ‌మ‌వుతోంది.