Begin typing your search above and press return to search.

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా మారడం చాలా అరుదుగా జరుగుతుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   3 Nov 2026 11:24 PM IST
పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా మారడం చాలా అరుదుగా జరుగుతుంది. అలా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వారు కూడా పెద్దగా విజయాలు అందుకున్న సందర్భాలు తక్కువ. కానీ ఇప్పుడు శ్రీకాంత్ కూతురు మేధ ఈ విషయంలో కొత్త చరిత్ర సృష్టించేలా కనిపిస్తోంది. తన అందమైన పిల్లి కళ్లతో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ భామకు వరుసగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల కూడా నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు కూడా హీరోయిన్‌గా ఎక్కువ అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు మేధ మాత్రం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు సిద్ధమవుతోంది.

మేధ ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఒక రొమాంటిక్ కామెడీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఈ సినిమాకు ప్రస్తుతం 'మైత్రి ఇన్ లవ్' అనే పేరు ప్రచారంలో ఉంది. కొత్త నటుడు జై జష్టి ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఇదిలా ఉంటే, మేధ మరో క్రేజీ సీక్వెల్‌లో కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరో వారంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే నిజమైతే మేధకు ఇది చాలా పెద్ద అవకాశంగా మారుతుంది.

గతంలో నందమూరి మోక్షజ్ఞ సినిమాలో కూడా మేధను హీరోయిన్‌గా తీసుకొని ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా ఆలస్యం కావడంతో పాటు కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం మారిపోయినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు వరుసగా సినిమాలు, క్రేజీ ప్రాజెక్టులతో మేధ ముందుకు వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్‌గా ఎదగడం కష్టమైనా, మొదటి సినిమా కూడా చెయ్యకముందే ఈ అమ్మాయికి ఎన్ని అవకాశాలు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ నటి హీరోల కూతుర్లల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి.. ఒక కొత్త ట్రెండ్ తీసుకొస్తుందేమో చూడాలి.