Begin typing your search above and press return to search.

కూచిపూడి వారి వీధి.. అడ్రస్ ఎక్కడ..?

మళ్లీ వెంకటేష్ నారప్ప ఛాన్స్ ఇచ్చాడు. ఆ రీమేక్ కూడా అతనికి పెద్దగా పేరు తీసుకు రాలేదు. ఐతే రెండేళ్ల క్రితం పెదకాపు అంటూ ఒక సినిమా చేశాడు శ్రీకాంత్ అడ్డాల.

By:  Ramesh Boddu   |   8 Oct 2025 11:06 AM IST
కూచిపూడి వారి వీధి.. అడ్రస్ ఎక్కడ..?
X

కొంతమంది దర్శకులకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఎందుకో సినిమాలు ఆశించిన విధంగా సక్సెస్ అవ్వవు.. నెక్స్ట్ ఆఫర్లు కూడా అంతగా రావు. కొత్త బంగారులోకం సినిమాతో ఎప్పుడో 17 ఏళ్ల క్రితమే సూపర్ హిట్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల రెండో సినిమా ముకుంద ఆశించిన సక్సెస్ అందుకోకపోయినా వెంకటేష్, మహేష్ లాంటి స్టార్స్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాసిక్ సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ కాగా మళ్లీ మహేష్ తో బ్రహ్మోత్సవం చేసి షాక్ ఇచ్చాడు. బ్రహ్మోత్సవం తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేయడానికి ఎవరు ముందుకు రాలేదు.

రెండేళ్ల క్రితం పెదకాపు సినిమా..

మళ్లీ వెంకటేష్ నారప్ప ఛాన్స్ ఇచ్చాడు. ఆ రీమేక్ కూడా అతనికి పెద్దగా పేరు తీసుకు రాలేదు. ఐతే రెండేళ్ల క్రితం పెదకాపు అంటూ ఒక సినిమా చేశాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా తో తన మాస్ యాక్షన్ యాంగిల్ చూపించాడు. ఆ సినిమా మీద ఎంతో నమ్మకం ఉండటంతో పెదకాపు పార్ట్ 1 అంటూ సీక్వెల్ కథ కూడా ఒకటి ఉంటుందని హింట్ ఇచ్చాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ సైలెంట్ అయ్యాడు.

ఇక ఆ నెక్స్ట్ కూచిపూడి వారి వీధి అంటూ ఒక కథ రాసుకుని ఆ సినిమా చేసే హీరో వేటలో పడ్డాడు శ్రీకాంత్ అడ్డాల. ముందు దగ్గుబాటి రానాతో సినిమా చేయాలని అనుకున్నా అది ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. కానీ ఇప్పుడు అదే సినిమాను కిరణ్ అబ్బవరంతో చేయాలని చూస్తున్నాడట. ఓ పక్క కిరణ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కూచిపూడి వారి వీధి కోసం శ్రీకాంత్ అడ్డాల వెయిట్ చేయక తప్పట్లేదు.

అభిరుచి గల దర్శకుడే అయినా..

శ్రీకాంత్ అడ్డాల మంచి అభిరుచి గల దర్శకుడే అయినా అతని రాంగ్ సెలక్షన్ వల్ల కెరీర్ ఇలా ఉండిపోయింది. పెదకాపు హిట్ పడితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ప్రస్తుతం కిరణ్ కోసం వెయిట్ చేయడం ఇష్టం లేక కూచిపూడి వారి వీధి సినిమాకు హీరో అడ్రస్ దొరక్క తర్జన భర్జనలో ఉన్నాడు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఎంతోకొంత లక్ కూడా కలిసి వస్తేనే అనుకున్నది సాధించగలం అన్నది ఇలాంటి విషయాలతో అర్ధమవుతుంది.

శ్రీకాంత్ అడ్డాల కూచిపూడి వారి వీధి కిరణ్ డేట్స్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తాడా లేదా మరో హీరోకి వెళ్తాడా అన్నది చూడాలి. శ్రీకాంత్, కిరణ్ అబ్బవరం కాంబో అయితే ఆడియన్స్ కి కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ సినిమా కుదరాలని సినీ లవర్స్ కోరుతున్నారు.