శ్రీహరి ని స్నేహితులే మోసం చేసారు!
వెండి తెరపై శ్రీహరి ప్రస్తానం గురించి చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన శ్రీహరి హీరోగా, ప్రధాన పాత్ర ధారిగా ఎన్నో సినిమాలు చేసారు.
By: Srikanth Kontham | 21 Aug 2025 12:00 AM ISTవెండి తెరపై శ్రీహరి ప్రస్తానం గురించి చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన శ్రీహరి హీరోగా, ప్రధాన పాత్ర ధారిగా ఎన్నో సినిమాలు చేసారు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. నటుడిగా ఆయనకు రీప్లేస్ మెంట్ లేదు.సేవా కార్యక్రమాల్లోనూ శ్రీహరి ఎప్పుడూ ముందుండేవారు. సహాయం అంటూ ఆయన గుమ్మం తొక్కితే అవసరాలు తీర్చి పంపించే గొప్ప దాతృ హృదయం గల వ్యక్తి. శ్రీహరికి స్నేహితులు కూడా ఎక్కువే.
ఆయన చుట్టూ నిత్యం స్నేహితులు కనిపించేవారు. ఆన్ సెట్స్ లో అయినా? అంతే స్నేహ భావంతో తోటి నటులతో మెలిగేవారు. శ్రీహరి షూటింగ్ ముగించుకుని ఇంటికొచ్చారంటే? ఆయన కంటే ముందే ఆయన స్నేహితులు రెడీగా ఉండేవారు. తెలంగాణ కల్చర్ లో భాగమైన పార్టీ సంస్కృతిని బాగా ఆస్వాదించేవారు. శ్రీహరి కారణంగా ఎంతో మంది ఇండస్ట్రీలో చిన్న చిన్న అవకాశాలు అందుకున్నారు. అలాంటి శ్రీహరిని తన స్నేహితులే మోసం చేసారని ఆయన భార్య డిస్కోశాంతి ఆరోపించారు.
శ్రీహరి చనిపోయిన తర్వాత ఆయన స్నేహితులే కొందరు మోసం చేసారన్నారు. `ఆ కారణంగా సగం ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది. అలా చేసింది శ్రీహరి నమ్మిన స్నేహితులే. ఆ సమయంలో ఆస్తుల గురించి ఆలోచించే సమయం కాదు. దీంతో నా నగలు అమ్మేసి ఇల్లు నెట్టుకుని వచ్చాను. బావ చేసిన దానధర్మాలే పుణ్యబలమై మా కుటుంబాన్ని కాపాడుతుందని బలంగా నమ్ముతాన`న్నారు. మోసం చేసిన వారిని ఆ దేవుడే చూసుకుంటాడని వదిలేసామన్నారు.
బావకి దైర్యం ఎక్కువ..ఎలాంటి సందర్భంలోనూ భయపడేవారు కాదు. యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండానే నటించేవారు. నేనెప్పుడైనా సెట్స్ కి వస్తున్నానని తెలిస్తే ముందుగానే రిస్క్ షాట్లు తీసేమని డైరెక్టర్ తో చెప్పేవారు. ఓసారి పెద్ద బిల్డింగ్ పై నుంచి డైరెక్టర్ బావను దూకించాడు. అది చూసి డైరెక్టర్ పై సీరియస్ అయ్యాను. కానీ తెరపై బావ యాక్షన్ సన్నివేశాలు బాగా ఎంజాయ్ చేసేదాన్ని అన్నారు.
