Begin typing your search above and press return to search.

శివ‌గామి పాత్ర‌లో ఆఫ‌ర్.. శ్రీ‌దేవిపై త‌ప్పుడు ప్ర‌చారం?

బాహుబ‌లి - ది బిగినింగ్, బాహుబ‌లి - ది క‌న్ క్లూజ‌న్ రెండు చిత్రాల‌ను క‌లిపి ఒకే సినిమాగా విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   6 Sept 2025 10:31 PM IST
శివ‌గామి పాత్ర‌లో ఆఫ‌ర్.. శ్రీ‌దేవిపై త‌ప్పుడు ప్ర‌చారం?
X

బాహుబ‌లి - ది బిగినింగ్, బాహుబ‌లి - ది క‌న్ క్లూజ‌న్ రెండు చిత్రాల‌ను క‌లిపి ఒకే సినిమాగా విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్‌లో `బాహుబ‌లి- ది ఎపిక్` పేరుతో ఇది విడుద‌ల కానుండ‌గా, అభిమానులు చాలా ఎగ్జ‌యిటింగ్‌గా వేచి చూస్తున్నారు. ఈ సినిమా కూడా రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

అయితే ఈ సినిమా హిందీ వెర్ష‌న్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బోనీ క‌పూర్ అంద‌రూ మ‌ర్చిపోయిన ఒక‌ పాత విష‌యాన్ని కెల‌క‌డం చ‌ర్చ‌గా మారింది. `బాహుబ‌లి`లో శివగామి పాత్రకు రమ్య కృష్ణన్‌ను ఖరారు చేయడానికి ముందు, నిర్మాతలు మొదట్లో శ్రీదేవిని సంప్రదించారు. కానీ శ్రీ‌దేవి తిర‌స్క‌రించారు. ఆ త‌ర్వాత అదే పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించారు. అయితే అలాంటి చారిత్రాత్మక పాత్రకు ఎందుకు నో చెప్పిందనే దానిపై చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. కానీ నిజం ఏమిటో ఎవ‌రికీ తెలీదు. అస‌లు శ్రీ‌దేవి ఎందువ‌ల్ల తిర‌స్క‌రించారు? అంటే...

ఇంగ్లీష్ వింగ్లీష్ కంటే త‌క్కువ పారితోషికం ఆఫ‌ర్ చేయ‌డంతో శ్రీ‌దేవి బాహుబ‌లి ఆఫ‌ర్ ని తిర‌స్క‌రించింద‌ని బోనీక‌పూర్ తెలిపారు. ప్ర‌చారం జ‌రిగిన‌ట్టు భారీ పారితోషికం, స్టార్ హోట‌ల్లో మొత్తం ఫ్లోర్, తన పరివారం కోసం విమాన టిక్కెట్లు డిమాండ్ చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ అవేవీ నిజాలు కావ‌ని బోనీ అన్నారు. గందరగోళాన్ని సృష్టించింది శ్రీదేవి డిమాండ్లు కాదు.. నిర్మాత విధానం అని బోనీ కపూర్ వెల్లడించారు. రాజమౌళి స్వయంగా తాను శ్రీదేవికి పెద్ద అభిమానినని చెప్పారు. శ్రీ‌దేవితో చ‌ర్చ‌ల‌ తర్వాత అతడికి గౌరవం పెరిగింది. నిర్మాతలు గందరగోళాన్ని సృష్టించారు. శ్రీదేవి ఆ సినిమా చేయలేదు.. ఎందుకంటే ఇంగ్లీష్ వింగ్లిష్ కోసం ఆఫర్ చేసిన పారితోషికం బాహుబ‌లి కోసం ఇచ్చేదానికంటే ఎక్కువ‌!`` అని బోనీ తెలిపారు.

త్రోబ్యాక్ మ్యాట‌ర్ గుర్తు చేసుకుని మ‌రీ బోనీక‌పూర్ దానిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. త‌న భార్య‌, దివంగ‌త శ్రీ‌దేవి త‌ప్పేమీ లేద‌ని, నిర్మాత‌ల గంద‌ర‌గోళం వ‌ల్ల‌నే ఆ పాత్ర‌ను వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపాడు.