Begin typing your search above and press return to search.

హాలీవుడ్ ఛాన్స్ ను వ‌దులుకున్న స్టార్ హీరోయిన్.. ఎందుకంటే?

అప్ప‌ట్లో హాలీవుడ్ సినిమా అంటే ఏలియన్ లాగా చేయ‌డ‌మేన‌ని, కానీ ఇప్పుడు అదొక గౌర‌వ‌మ‌ని, అందుకే ఒప్పుకోలేద‌ని చెప్పారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   15 April 2026 12:00 AM IST
హాలీవుడ్ ఛాన్స్ ను వ‌దులుకున్న స్టార్ హీరోయిన్.. ఎందుకంటే?
X

భారతీయ సినీ పరిశ్రమలో అతిలోక సుంద‌రి అనే బిరుదును సార్థ‌కం చేసిన అరుదైన నటి శ్రీదేడి. డ్యాన్స్, కామెడీ, సీరియస్, రొమాంటిక్.. ఏ జానర్ అయినా ఆమె పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను త‌న న‌ట‌న‌తో మంత్రముగ్ధులను చేశారు. పాత్రల ఎంపికలోనూ ఆమెకు ప్రత్యేకమైన దృష్టికోణం ఉండేది. తన ఇమేజ్‌కు సరిపడే, కథలో బలం ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ క్రమంలోనే కెరీర్‌లో ఎన్నో పెద్ద అవకాశాలను కూడా ఆమె సున్నితంగా తిరస్కరించార‌నే విషయం ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తోంది.

జురాసిక్ పార్క్ ను రిజెక్ట్ చేసిన శ్రీదేవి

అందులోనూ మ‌రీ ముఖ్యంగా హాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ తెరకెక్కించిన జురాసిక్ పార్క్ సినిమా ఆఫర్ ప్రత్యేకంగా నిలుస్తుంది. 1993లో రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాంటి భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం చాలా మందికి కల లాంటిది. కానీ శ్రీదేవి మాత్రం ఆ పాత్ర‌ను విన‌యంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తోంది. అయితే హాలీవుడ్ ఆఫ‌ర్ ను వ‌దులుకోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని కూడా ఆమె ఓ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

డ‌ర్ మూవీని కూడా!

అప్ప‌ట్లో హాలీవుడ్ సినిమా అంటే ఏలియన్ లాగా చేయ‌డ‌మేన‌ని, కానీ ఇప్పుడు అదొక గౌర‌వ‌మ‌ని, అందుకే ఒప్పుకోలేద‌ని చెప్పారు. ఆ సమయంలో హాలీవుడ్‌లో నటించడం అనేది ఇప్పటిలా ప్రతిష్ఠాత్మకంగా భావించబడకపోవడం త‌న నిర్ణయానికి కారణమని పేర్కొన్నారు. అదొక‌టే కాదు, బాలీవుడ్‌లోని డ‌ర్ సినిమాను కూడా శ్రీదేవి తిర‌స్క‌రించ‌డం ఆస‌క్తిక‌ర అంశం.

డ‌ర్ మూవీలో ఆ క్యారెక్ట‌ర్ అయితే చేసేదాన్ని

షారుఖ్ ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించిన డ‌ర్ మూవీ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. అయితే డ‌ర్ మూవీలో త‌న‌కు ఆఫ‌ర్ చేసిన పాత్ర చాలా సాధార‌ణంగా ఉంద‌నిపించ‌ద‌ని, అప్ప‌టికే ఆ త‌ర‌హా పాత్ర‌లు తాను చాలా చేశాన‌ని, అందుకే ఆ ఆఫ‌ర్ ను రిజెక్ట్ చేసిన‌ట్టు చెప్పారు. త‌ర్వాత అదే క్యారెక్ట‌ర్ ను జూహీ చావ్లా పోషించి మంచి గుర్తింపు అందుకున్నారు. ఈ విషయంపై స్పందించిన శ్రీదేవి త‌న‌కు ఆఫ‌ర్ చేసిన పాత్ర కొత్తగా అనిపించక‌పోవ‌డం వ‌ల్లే దాన్ని ఒప్పుకోలేద‌ని, షారుక్ ఖాన్ పాత్ర మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపించింద‌ని, బ‌హుశా ఆ పాత్ర‌ను ఇచ్చి ఉంటే చేసి ఉండేదాన్న‌ని చెప్పడం ఆమె ఎంపికల్లోని స్పష్టతను చూపిస్తుంది.

అయితే ఆ అవ‌కాశాలను వ‌దులుకున్నందుకు ఆమె ఎప్పుడూ బాధ‌ప‌డ‌లేద‌ని ఆమె ప‌లుమార్లు చెప్పారు. ఆమె త‌న కెరీర్ లో సాధించిన విజ‌యాలు, ఆడియ‌న్స్ నుంచి అందుకున్న ప్రేమ ఎంతో మ‌ర‌వ‌లేద‌నిద‌ని ఆమె ఎప్పుడూ చెప్తుంటారు. మొత్తంగా చూసుకుంటే శ్రీదేవి కెరీర్ ఓ క్లియ‌ర్ మెసేజ్ ను ఇస్తుంది. ప్ర‌తీ ఛాన్స్ గొప్ప‌దే అయినా, ప్ర‌తీ పాత్ర మ‌న‌కు స‌రిపోవాల‌నే అవ‌స‌రం లేదు. క‌థ‌, పాత్ర ప్ర‌ముఖ్య‌త‌, ప‌ర్స‌న‌ల్ ఇమేజ్ ఇవ‌న్నీ ఆమెను సాధార‌ణ స్టార్ గా కాకుండా, త‌రాల పాటూ గుర్తుండిపోయే లెజెండ్ గా నిల‌బెట్టాయి.