Begin typing your search above and press return to search.

నానికి చెడ్డపేరు తీసుకురాకూడదని ఫిక్స్ అయ్యా.. కోర్ట్ శ్రీదేవి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

కోర్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రీదేవి అపల్ల, తమిళ నటుడు ఏగన్ జంటగా నటించిన కాలేజీ రొమాంటిక్ ఎంటర్టైనర్ హైకూ.

By:  M Prashanth   |   19 Oct 2026 7:30 PM IST
నానికి చెడ్డపేరు తీసుకురాకూడదని ఫిక్స్ అయ్యా.. కోర్ట్ శ్రీదేవి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
X



కోర్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రీదేవి అపల్ల, తమిళ నటుడు ఏగన్ జంటగా నటించిన కాలేజీ రొమాంటిక్ ఎంటర్టైనర్ హైకూ. అక్టోబర్ 23న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దర్శకుడు యువరాజ్ తో తనకు పదేళ్ల పరిచయం ఉందని, ముంబైలో ఉన్న తనను నాన్న పిలిపించి మరీ ఈ కథ వినిపించారని హీరో ఏగన్ చెప్పాడు. కాలేజీ ఎపిసోడ్ వినగానే కథకు కనెక్ట్ అయి వెంటనే ఓకే చెప్పేశానని అన్నాడు.

చెన్నై మాల్స్ లో తిరుగుతున్నప్పుడు తమిళ ఆడియన్స్ తన దగ్గరకు వచ్చి కోర్ట్ సినిమా బాగుందని చెప్పడంతో తమిళంలోనూ నటించాలనే ఆసక్తి కలిగిందని శ్రీదేవి తెలిపింది. జో లాంటి హిట్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ నుంచి పిలుపు రావడంతో నెక్స్ట్ డే వెళ్లి కథ విన్నానని చెప్పింది. ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిలకే కష్టమని, ఎప్పుడూ గొడవలు పడుతుంటారని.. అలాంటిది అంతమంది అమ్మాయిల మధ్య ఒక్క అబ్బాయి ఎలా సర్వైవ్ అయ్యాడనే పాయింట్ భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని ఆమె నవ్వుతూ వివరించింది.

తెలుగులో తాను చూసిన ఫస్ట్ సినిమా జెర్సీ అని, అప్పటినుంచి నాని అంటే ఇష్టమని ఏగన్ మనసులో మాట బయటపెట్టాడు. షూటింగ్ ఫస్ట్ డే నుంచే నానిని కలిపించమని శ్రీదేవిని అడుగుతూనే ఉన్నానని చెప్పాడు. దీనిపై శ్రీదేవి స్పందిస్తూ.. నాని ప్రస్తుతం బ్లడీ రోమియో లుక్ లో ఉండటంతో బయటకు రివీల్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆయన్ని కలిపించడానికి ట్రై చేస్తుంటే ఏగన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయని, నాని మేనేజర్ తో మాట్లాడుతున్నానని ఆమె సరదాగా చెప్పుకొచ్చింది.

కోర్ట్ సినిమా తర్వాత తనపై బాధ్యత మరింత పెరిగిందని శ్రీదేవి చెప్పింది. నాని గారి ప్రొడక్షన్ నుంచి లీడ్ గా పరిచయమయ్యానని, మీరందరూ ఏ ఆడియో లాంచ్ లో ఉన్నా వెనుక ఉండి క్లాప్స్ కొడతానని నాని అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాక ఆయనకు ఎలాంటి చెడ్డపేరు తీసుకురాకూడదని ఫిక్స్ అయ్యానని తెలిపింది. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నానని, కేవలం లవ్ స్టోరీలే కాకుండా యాక్టర్ గా థ్రిల్లర్స్ తో పాటు అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది.

వేరే షూటింగ్ వల్ల టైమ్ లేక తెలుగులో తాను సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేకపోయానని, అయినా డబ్బింగ్ వాయిస్ తనకు పర్ఫెక్ట్ గా సెట్ అయిందని శ్రీదేవి సంతోషం వ్యక్తం చేసింది. తమిళం 60 శాతం వరకు మాట్లాడగలనని ఆమె చెబితే, శ్రీదేవి చాలా తగ్గించుకుని చెబుతోందని, ఆమె ఏకంగా 80 నుంచి 90 శాతం తమిళం బాగా మాట్లాడుతుందని ఏగన్ మెచ్చుకున్నాడు. తాను మాత్రం స్లో లెర్నర్ నని, ప్రస్తుతానికి 5 శాతం మాత్రమే తెలుగు నేర్చుకున్నానని ఏగన్ నవ్వించాడు.

యూట్యూబ్ నుంచి సినిమాల వరకు వచ్చిన ప్రయాణంలో తాను కన్సిస్టెన్సీ నేర్చుకున్నానని ఏగన్ తెలిపాడు. హిట్టు ఫ్లాపులు ఆడియన్స్ చేతుల్లో ఉంటాయి కాబట్టి మన వంతు వంద శాతం కష్టపడాలని శ్రీదేవి అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో అంతా మంచే చెబితే మనకు కొమ్ములు వచ్చేస్తాయని, అందుకే నెగెటివ్ కామెంట్స్ కూడా ఉండాలని ఆమె ప్రాక్టికల్ గా మాట్లాడింది. తనపై వచ్చే నెగెటివ్ రీల్స్ ను కూడా ఫ్రీ ప్రమోషన్ లాగే పాజిటివ్ గా తీసుకుంటానని శ్రీదేవి క్లారిటీ ఇచ్చింది.