Begin typing your search above and press return to search.

ప్రేయసితో శ్రీసింహా.. తేలు, అమృతం!

అయితే ఇది కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ ట్రిప్ మాత్రమే కాదు. క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఈ ట్రిప్ లో జాయిన్ అయ్యారు. అందరూ కలిసి ఫుల్ గా సందడి చేస్తున్నారు.

By:  M Prashanth   |   5 Dec 2025 1:01 PM IST
ప్రేయసితో శ్రీసింహా.. తేలు, అమృతం!
X

యంగ్ హీరో శ్రీ సింహా ఒక వైపు సినిమాలు, మరోవైపు పర్సనల్ లైఫ్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో రాగతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన సింహా, ఇప్పుడు ఆ మ్యారేజ్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు ఏడాది పూర్తవుతున్న సందర్భంగానో, లేక షూటింగ్స్ నుంచి చిన్న బ్రేక్ దొరికిందో తెలియదు కానీ.. భార్య, ఫ్రెండ్స్ తో కలిసి ఒక క్రేజీ ట్రిప్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఆ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లేటెస్ట్ గా శ్రీ సింహా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే వారు ఫుల్ చిల్ మోడ్ లో ఉన్నారని అర్థమవుతోంది. పచ్చని ప్రకృతి ఒడిలో, ఏదో హిల్ స్టేషన్ లో వారు సేద తీరుతున్నారు. భార్య రాగతో కలిసి సింహా దిగిన సెల్ఫీలు చాలా క్యూట్ గా ఉన్నాయి. ఏడాది గడిచినా వీరిద్దరిలో ఆ కొత్త జంట కళ ఏమాత్రం తగ్గలేదు. అన్యోన్యంగా, హ్యాపీగా కనిపిస్తూ కపుల్ గోల్స్ ఇస్తున్నారు.

అయితే ఇది కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ ట్రిప్ మాత్రమే కాదు. క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఈ ట్రిప్ లో జాయిన్ అయ్యారు. అందరూ కలిసి ఫుల్ గా సందడి చేస్తున్నారు. "టకీలా" అనే బోర్డు వెనుక గ్యాంగ్ అంతా నిల్చుని ఇచ్చిన ఫోజులు చూస్తుంటే అక్కడ పార్టీ వైబ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఇలా టైమ్ స్పెండ్ చేయడం నిజంగా బెస్ట్ మెమరీ.

ఈ ఫోటోల్లో నెటిజన్లను ఎక్కువగా ఆకర్షించింది మాత్రం సింహా వేసుకున్న టీ షర్ట్. మనందరికీ ఇష్టమైన 'అమృతం' సీరియల్ క్యారెక్టర్స్ గుండు హనుమంతరావు, హర్ష వర్ధన్ బొమ్మలతో ఉన్న ఆ బ్లాక్ టీ షర్ట్ చాలా వెరైటీగా, నాస్టాల్జిక్ గా ఉంది. అలాగే కిచెన్ లో సింహా ఏదో వంట ప్రయోగం చేస్తున్న వీడియో క్లిప్ కూడా నవ్వులు పూయిస్తోంది. మీల్ ప్రిపరేషన్ అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ ఫన్నీగా ఉంది.

ఈ ట్రిప్ లో వారు కేవలం ఎంజాయ్ చేయడమే కాదు, నేచర్ ని కూడా ఎక్స్ ప్లోర్ చేస్తున్నారు. అక్కడ కనిపించిన చిన్న చిన్న పువ్వులు, దారిలో కనిపించిన తేలు.. ఇలా ప్రతి దాన్ని ఫోటో తీసి మెమరీగా దాచుకున్నారు. 'మత్తు వదలరా 2' సక్సెస్ తర్వాత కెరీర్ పరంగా కూడా జోష్ లో ఉన్న సింహా, మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.