Begin typing your search above and press return to search.

స‌క్సెస్ లేక‌పోతే కుక్క క‌న్నా హీనం!

మారుతి తెర‌కెక్కించిన `ఈరోజుల్లో` సినిమాతో వెలుగులోకి వ‌చ్చిన న‌టుడు మంగం శ్రీనివాస్ అలియాస్ శ్రీ. బోల్డ్ కంటెంట్ తో తెర‌కెక్కిన సినిమా అప్ప‌ట్లో యూత్ కి బాగా క‌నెక్ట్ అయింది.

By:  Srikanth Kontham   |   17 Dec 2025 12:00 AM IST
స‌క్సెస్ లేక‌పోతే కుక్క క‌న్నా హీనం!
X

మారుతి తెర‌కెక్కించిన `ఈరోజుల్లో` సినిమాతో వెలుగులోకి వ‌చ్చిన న‌టుడు మంగం శ్రీనివాస్ అలియాస్ శ్రీ. బోల్డ్ కంటెంట్ తో తెర‌కెక్కిన సినిమా అప్ప‌ట్లో యూత్ కి బాగా క‌నెక్ట్ అయింది. నిర్మాత‌ల‌కు మంచి లాభాలొచ్చాయి. మారుతికి ద‌ర్శ‌కుడిగా ఇదే తొలి సినిమా. అలా ఆ చిత్ర యూనిట్ తొలి సినిమాతోనే మంచి స‌క్సెస్ అయింది. ఆ త‌ర్వాత మారుతి కాల‌క్ర‌మంలో పెద్ద ద‌ర్శ‌కుడు అయ్యాడు. అందులో పెట్టుబ‌డి పెట్టిన నిర్మాత‌లు బాగానే సంపాదించుకున్నారు. ఆ సినిమా లో నటించిన హీరో సంగ‌తేంటి? అంటే శ్రీ కెరీర్ మాత్రం అనుకున్నంత గొప్ప‌గా సాగలేదు.

ఆ సినిమా త‌ర్వాత అవ‌కాశాలైతే అందుకున్నాడు కానీ అవేవి స‌క్స‌స్ అవ్వ‌లేదు. `పుస్త‌కంలో కొన్ని పేజీలు` మిస్సింగ్`, `అర‌వింద్ 2`, `ల‌వ్ సైకిల్`, `రై రై`, `గ‌లాటా`, `సాహ‌సం చేయ‌రా డింభకా`, `త్రివిక్ర‌మ‌న్,` త‌మాషా` ఇలా కొన్ని సినిమాలు చేసాడు. కానీ ఇవేవి సక్స‌స్ అవ్వ‌లేదు. చివ‌రిగా ఐదేళ్ల క్రితం `ప్ర‌ణవం`లో న‌టించాడు. ఆ త‌ర్వాత క‌నిపించ‌లేదు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ ద్వారా శ్రీ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఇండ‌స్ట్రీలో కేవ‌లం స‌క్సెస్ ఉంటే మాత్ర‌మే గుర్తిస్తార‌ని అది లేక‌పోతే ప‌రిశ్ర‌మ కుక్క క‌న్నా హీనంగా చూస్తుంద‌న్నాడు. అవ‌కాశాల పేరుతో పిలిపించుకుని స‌మ‌యం వృద్దా చేయ‌డం వంటివి ఎన్నో చూసాన‌న్నాడు.

ఈ మ‌ధ్య‌నే ఓ పేరున్న డైరెక్ట‌ర్ రాత్రి ఫోన్ చేసి ఉదయాన్నే ఆరు గంట‌ల‌కు ర‌మ్మ‌న్నాడు. దీంతో రాత్రి కి రాత్రే విజ‌య‌వాడ నుంచి బ‌య‌ల్దేరి రామోజీ ఫిలిం సిటీలో రూమ్ తీసుకుని అక్క‌డే ఉన్నాను. ఉద‌యం ఆరుగంట‌ల‌కు సెట్స్ కు వెళ్లాలంటే? లేటు అవుతుంద‌ని రాత్రంతా రూమ్ ఉన్నా? కారులో నే ప‌డుకున్నాను. తీరా ఆరుగంట‌ల‌కు వెళ్తే అత‌డు టిఫిన్ చేస్తున్నాడు. న‌న్ను చూసాడు . కానీ పిల‌వ‌లేదు. మాట్లాడ‌లేదు. చివ‌రికి నేనే ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌లిస్తే? త‌ర్వాత క‌లుద్దామ‌ని వెళ్లిపోయాడు. మ‌రి అత‌డు కావాల‌ని అలా చేసాడా? నా స‌హ‌నాన్ని ప‌రీక్షంచాల‌ని చేసాడా? అన్న‌ది తెలియ‌దు.

అప్ప‌టికే నేను విజ‌య‌వాడ‌లో ఉంటున్నాను. అక్క‌డ నుంచి రావాల‌ని చెప్పాను. అన్ని చెప్పినా వెయిటింగ్ త‌ప్ప‌లేదు. ఇలాంటి అనుభ‌వాలు ప‌రిశ్ర‌మ‌లో కొత్తేం కాదు. గ‌తంలో కూడా రెండు..మూడు సార్లు ఇలాగా జ‌రిగింది. ప్ర‌స్తుతం ఎలాంటి పాత్ర‌లు పోషించ‌డానికైనా సిద్దంగా ఉన్నాను. హీరో అనే కాదు..విల‌న్ ..స‌హాయ పాత్ర‌లు చేయ‌డానికి కూడా రెడీగా ఉన్నానన్నాడు. మ‌రి అవ‌కాశాలు వ‌స్తాయో? లేదో? అని న‌వ్వేసాడు.