శ్రీలీల వెరీ సీరియస్..డోంట్ డిస్టర్బ్!
అలాగని హీరోయిన్ అవకాశాలకు దూరం కాలేదు. అమ్మడు ఎంత ప్రయత్నిస్తున్నా? మెయిన్ లీడ్ కి ప్రమోట్ అవ్వడం లేదు.
By: Srikanth Kontham | 17 Jan 2026 6:00 PM ISTఉన్న పళంగా శ్రీలీల బాలీవుడ్ కి ఎందుకు వెళ్లింది? అవకాశాలు వచ్చినా, తీసుకున్న అడ్వాన్సులు కూడా వెనక్కి ఇ చ్చేసి మరీ హిందీ సినిమాల వైపు మళ్లింది? అమ్మడిలో ఈ సడెన్ ఛేంజ్ చూసి అభిమానులు సహా ప్రేక్షకులు షాక్ అయ్యారు. తెలుగు అవకాశాలను వదులకుని బంగారంలాంటి భవిష్యత్ ను నాశనం చేసుకుంటుందనే ఊహగానాలు వ్యక్తమయ్యాయి. దీనికి కారణంగా బాలీ వుడ్ లో స్థిరపడాలి...భవిష్యత్ ని అక్కడే నిర్దేశించుకుని ముందుకు సాగుతుందని అతా అనుకున్నారు. కానీ అసలు కారణం అది కాదు. తెలుగు సినిమాల్లో నటిస్తే తనకు ప్యూచరే ఉండదని అమ్మడు ముందుగానే గెస్ చేసి బాలీవుడ్ కి వెళ్లినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ లో శ్రీలీల ఇంకా పూర్తి స్థాయిలో హీరోయిన్ గా స్థిరపడలేదు. కెరీర్ ని ఇంకా నిర్మించుకునే ప్రయత్నాల్లోనే ఉంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆ పాత్రాలు తనలో మాస్ కోణాన్ని హైలైట్ చేసాయి తప్ప హీరోయిన్గా ఐడెంటిటీని తీసుకురాలేదన్నది కాదనలేని నిజం. అదే సమయంలో ఐటం పాటల్లో కూడా నటించింది. దీంతో గ్లామర్ పాత్రల్లో అవకాశాలు పుంజుకుంటున్నాయి. అప్పటికే కొన్నిసినిమాల్లో గ్లామర్ గా కని పించడం..`పుష్ప 2` లో ఐటం పాట ఆటలో అలరించడం తెలిసిందే. దీంతో ఆ తరహా పాత్రలు టాలీవుడ్ లో ఊపందుకున్నాయి.
అలాగని హీరోయిన్ అవకాశాలకు దూరం కాలేదు. అమ్మడు ఎంత ప్రయత్నిస్తున్నా? మెయిన్ లీడ్ కి ప్రమోట్ అవ్వడం లేదు. సెకెండ్ లీడ్ లోనే దర్శకులు తీసుకుంటున్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్ లో ఇంకా కింద స్థాయి పాత్రలే పోషించాల్సి ఉంటుంది. గ్లామర్ డాల్ గానే ప్రేక్షకుల్ని కలకాలం అలరించాల్సి ఉంటుంది. వీటన్నింటి అమ్మడు మైండ్ లో రివైండ్ చేసుకుని కెరీర్ లో ఇంత వరకూ తానెంత సక్సస్ అయింది? సాధించాల్సింది ఏంటి? ప్రస్తుతం టాలీవుడ్ లో తాను ఎలాంటి స్థానంలో కొనసాగుతుంది? ఇవన్నీ కూలంకుశంగా విశ్లేషించుకుంది.
దీంతో భవిష్యత్ మొత్తం కళ్ల ముందు కనిపించింది. అదే సమయంలో టాలీవుడ్ లో సినిమాలు చేయ కూడదని, బలమైన నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చిన హీరోయిన్ అవకాశాలు సైతం వదలుకుని బాలీవుడ్ సినిమాలకు డేట్లు ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది. `ఆషీకీ` ప్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతోన్న పార్ట్ 3లో నటిస్తోంది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఇం దులో హీరోతో ఇంటిమేట్ సన్ని వేశాల్లోనూ అమ్మడు ఎక్కడా తగ్గలేదనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో జరుగుతోంది. దీన్ని బట్టి శ్రీలీల పాత్ర డిమాండ్ చేసిం దంటే? ఎందాకైనా వెళ్తుంది? పనిగట్టుకుని గ్లామర్ డాల్ ని చేద్దామంటే మాత్రం ససేమేరా అంటోంది అన్నది అర్దమవుతుంది.
