Begin typing your search above and press return to search.

పిక్ ఆఫ్ ది డే: అసలైన కిస్సిక్ ఫోటో

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే శ్రీ లీల తాజాగా పుష్ప: ది రూల్ చిత్రంలోని కిస్సిక్ సెట్ నుండి సరదాగా గడిపిన సందర్భాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

By:  Madhu Reddy   |   6 Dec 2025 10:27 PM IST
పిక్ ఆఫ్ ది డే: అసలైన కిస్సిక్ ఫోటో
X

సాధారణంగా కొన్ని కొన్ని క్రేజీ కాంబినేషన్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే మాత్రం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతలా హాట్ టాపిక్ గా మారుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. మరికొన్ని పిక్ ఆఫ్ ది డే గా నిలిచిపోతాయి. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఇది కదా అసలైన కిస్సిక్ ఫోటో అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఆ ఫోటోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే శ్రీ లీల తాజాగా పుష్ప: ది రూల్ చిత్రంలోని కిస్సిక్ సెట్ నుండి సరదాగా గడిపిన సందర్భాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఆ ఫోటోలలో అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఫోటో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలబడమే కాకుండా ఇది కదా అసలైన కిస్సిక్ ఫోటో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఇకపోతే శ్రీలీల షేర్ చేసిన ఫోటోలు, వీడియోలలో అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో పాటు అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తో చేసిన అల్లరికి సంబంధించిన వీడియోను కూడా ఈమె షేర్ చేసింది.. . " కిస్సిక్ సాంగ్ కి ఏడాది.. గ్రేట్ ఫుల్" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. పైగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కిస్సిక్ సాంగ్ సెట్ నుంచి షేర్ చేయడంతో ఇన్సైడ్ ఫోటోలు చూసిన అభిమానులు కూడా ఎగ్జైట్ అవుతున్నారు.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇందులో సమంత ఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా 2024లో పుష్ప: ది రూల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. ఇందులో కూడా రష్మిక , అల్లు అర్జున్ నటించగా.. శ్రీ లీల స్పెషల్ సాంగ్ చేసింది." కిస్ కిస్ కిస్సిక్" అంటూ స్పెషల్ సాంగులో అదరగొట్టేసింది శ్రీ లీల. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రావడమే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాలలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది.

ఈ సినిమా తర్వాత శ్రీ లీలాకి వరుసగా అవకాశాలు తలుపు తడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న పరాశక్తి సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే శివ కార్తికేయన్ తో మరో ప్రాజెక్టులో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.