Begin typing your search above and press return to search.

తెలుగు న‌టి అయినా తంబీలు సొంత మ‌నిషిలా!

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటి శ్రీగౌరి ప్రియ తాజాగా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

By:  Srikanth Kontham   |   25 Aug 2026 4:00 PM IST
తెలుగు న‌టి అయినా తంబీలు సొంత మ‌నిషిలా!
X

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటి శ్రీగౌరి ప్రియ తాజాగా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భాషా బేధాలతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నిరూపిస్తున్నారు. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, విజయాల గురించి మీడియాతో ముచ్చటించారు. తెలుగు నేపథ్యం ఉన్నా? కోలీవుడ్‌లో అడుగుపెట్టి తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం పట్ల గౌరీ సంతోషం వ్యక్తం చేశారు.

ఇటీవల కాలంలో గౌరీ ప్రియ‌ నటించిన ప్రాజెక్ట్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విభిన్న కథాంశాలతో వస్తున్న చిత్రాలను ఎంచుకుని నటిగా తన పరిధిని విస్తరించుకుంటున్నట్లు తెలిపారు.సినిమా పరిశ్రమలో ఒక భాష నుంచి మరో భాషకు వెళ్లినప్పుడు మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురుకావడం సహజమేనని శ్రీగౌరి ప్రియ పేర్కొన్నారు. అయితే త‌మిళ దర్శకులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారం వల్ల తమిళ భాషపై పట్టు సాధించగలిగానని వెల్లడించారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడమే తన విజయానికి అసలు రహస్యమని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కోలీవుడ్‌లో వస్తున్న సరికొత్త ట్రెండ్స్ ..వైవిధ్యమైన కథల గురించి కూడా ప్రస్తావించారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా బలమైన భావోద్వేగాలు ఉన్న పాత్రల్లో నటించడానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రేక్షకుల నాడిని ప‌ట్టుకుని ముందుకు సాగడమే నటిగా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలుగు అమ్మాయి అయినా? తమిళ ప్రేక్షకులు తనను సొంత మనిషిలా ఆదరిస్తున్నారని, ఆ ప్రేమ తనకెంతో సంతృప్తిని ఇస్తోందని శ్రీగౌరి ప్రియ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మ‌రిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

గౌరీ ప్రియ‌ ప్రయత్నాలు కోలీవుడ్‌లో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తున్నాయి. ప్ర‌స్తుతం అమ్మ‌డు అక్క‌డ మూడు నాలుగు ప్రాజెక్ట్ లు క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవ‌లే రిలీజ్ అయిన తెలుగు సినిమా చెన్నైల‌వ్ స్టోరీతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమ్మ‌డి పాత్ర‌కు మంచి పేరొచ్చింది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డా కొత్త అవ‌కాశాలు త‌లుపు త‌డుతున్నాయి. ఇప్ప‌టికే `వీసా` అనే మ‌రో తెలుగు చిత్రంలోనూ న‌టిస్తున్నారు.