Begin typing your search above and press return to search.

మ‌హేష్ చేత‌ల్లో పిల్ల ఇప్పుడా హీరోయిన్!

తెలుగ‌మ్మాయి శ్రీదివ్య గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప్రస్తుతం తెలుగులో పాటు త‌మిళ్ లోనూ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది.

By:  Srikanth Kontham   |   19 Nov 2025 4:49 PM IST
మ‌హేష్ చేత‌ల్లో పిల్ల ఇప్పుడా హీరోయిన్!
X

తెలుగ‌మ్మాయి శ్రీదివ్య గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప్రస్తుతం తెలుగులో పాటు త‌మిళ్ లోనూ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. న‌టిగా త‌న‌కంటూ ప్రత్యేక‌మైన గుర్తింపు ఉంది. అందం, అభిన‌యంతో పాటు ప్ర‌తిభా వంతురాలు కావ‌వ‌డంతోనే ప‌రిశ్ర‌మ‌లో స‌క్స‌స్ అయింది. మ‌రి ఈ అంద‌మైన న‌టి బాల న‌టి అని ఎంత మందికి తెలుసు. అవును శ్రీదివ్య బాల న‌టే. రెండున్న‌ర ద‌శాబ్దాల క్రిత‌మే శ్రీదివ్య ప్ర‌యాణం బాల న‌టిగా మొద‌లైంది. `హ‌న‌మాన్ జంక్ష‌న్` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత `యువ‌రాజు`, `వీడే`, `భార‌తి` సినిమాల్లో న‌టించింది.

అదే అనుభ‌వంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మ‌రి యువ‌రాజ్ సినిమా అంటే అందులో హీరో ఎవ‌రో? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అప్పుడు మ‌హేష్ బాబు అయినా? ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ గా మారాడు. ఆ సినిమాలో శ్రీదివ్య బాల న‌టిగా క‌నిపించింది. ఓసీన్ లో భాగంగా మ‌హేష్ ఆ పాప‌ని ఎత్తుకుంటాడు. తాజాగా ఆ ఫోటో ఒక‌టి కోలీవుడ్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఓ షోలో ఆ ఫోటో చూపిస్తూ మ‌హేష్ చేతుల్లో ఉన్న‌ది ఎవ‌రో చెప్పండి? అంటూ స‌హ యాంక‌ర్ ని అడుగుతుంది శ్రీదివ్య. అత‌డు చెప్ప‌లేక‌పోవ‌డంతో అది నేనే అంటూ చెబుతుంది. వెంట‌నే అత‌డు షాక్ అవుతాడు. అది నువ్వా? అని స‌ర్ ప్రైజ్ అవుతాడు. నువ్వు మ‌హేష్ చేతుల్లో ఏంటి? అని ఆశ్చ‌ర్య‌పోతాడు.

ఆ పిల్లే ఇప్పుడు హీరోయిన్ గా రెండు భాష‌ల్లోనూ అల‌రిస్తోంది. ఇప్పుడా ఫోటో ప్ర‌త్యేక‌త దేనికంటే? మ‌హేష్ పెద్ద స్టార్ కావ‌డం..రాజ‌మౌళితో గ్లోబ‌ల్ స్థాయిలో సినిమా తీయ‌డంతో? ఆపిక్ వైర‌ల్ గా మారింది. `వార‌ణాసి`పై అంచ నాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. `వార‌ణాసి` రిలీజ్ అనంత‌రం సూప‌ర్ స్టార్ మ‌హేష్ పాన్ ఇండియాని దాటి గ్లోబ‌ల్ స్టార్ అవుతాడు. అక్క‌డ నుంచి అత‌డి ప్ర‌యాణం ఇంకెంత దూరం వెళ్తుందో ఊహ‌కే అందదు. మ‌హేష్ భ‌విష్య‌త్ ని ఆ రేంజ్ లో ప్లాన్ చేసే రాజ‌మౌళి 120 దేశాల్లో వార‌ణాసి రిలీజ్ చేస్తున్నాడు? అన్న‌ది కాద‌న‌లేని నిజం.

ప్ర‌పంచ సినిమా దిగ్గ‌జాల స‌ర‌స‌నే తెలుగు న‌టుల్ని కూర్చోబెడుతున్నాడు జ‌క్క‌న్న‌. అందుకే హీరోలంతా కూడా రాజ‌మౌళికి అంతే ప్రాధాన్య‌త ఇస్తారు. జ‌క్క‌న్న ఏం చెప్పినా తూచ త‌ప్ప‌కుండా పాటిస్తారు. ఈ నేప‌థ్యంలో `వార‌ణాసి` చిత్రాన్ని మ‌హేష్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్ర‌క‌టించాడు. వాస్త‌వానికి మ‌హేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఎన్నుడు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఆయ‌న‌కు డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది? అన్న‌ది సంగ‌తి కూడా తెలియ‌దు. రాజ‌మౌళి తో సినిమా మొద‌లైన త‌ర్వాత ఆ చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ గా మారింది.