భలే జానర్ ను పట్టేసిన శ్రీవిష్ణు!
సినిమా సినిమాకీ కొత్త జానర్లు ట్రై చేస్తూ, డిఫరెంట్ ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ ను అలరించడానికి ప్రయత్నించే హీరోల్లో శ్రీ విష్ణు కూడా ఒకరు.
By: Sravani Lakshmi Srungarapu | 14 Nov 2025 1:12 PM ISTసినిమా సినిమాకీ కొత్త జానర్లు ట్రై చేస్తూ, డిఫరెంట్ ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ ను అలరించడానికి ప్రయత్నించే హీరోల్లో శ్రీ విష్ణు కూడా ఒకరు. ప్రతీసారీ డిఫరెంట్ స్క్రిప్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న శ్రీ విష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. శ్రీవిష్ణు కెరీర్ మొదటి నుంచే తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ రాగా, అతని కెరీర్ ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లిన సినిమాల్లో సామజవరగమన మాత్రం ముందు వరుసలో ఉంటుంది.
సామజవరగమనతో బిగ్గెస్ట్ హిట్
ఈ సినిమాలోని కామెడీతో పాటూ సెంటిమెంట్, లవ్, ఎమోషనల్ ఇలా అన్ని అంశాలతో ఆడియన్స్ ను ఎంతగానో ఎంటర్టైన్ చేసిందీ సినిమా. తాతల నుంచి వచ్చే ఆస్తి కోసం తండ్రిని డిగ్రీ పూర్తి చేయించేందుకు కష్టాలు పడే కొడుకుగా శ్రీవిష్ణు ఈ మూవీతో ఆడియన్స్ ను ఎంతో అలరించారు. సామజవరగమన మూవీతో తనకు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో శ్రీ విష్ణు మరో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
డిసెంబర్- జనవరి నుంచి షూటింగ్ మొదలు
సామజవరగమన తర్వాత శర్వానంద్ తో కలిసి నారీ నారీ నడుమ మురారి సినిమాను చేసిన రామ్ అబ్బరాజు, ఆ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శర్వానంద్ సినిమా తర్వాత రామ్ అబ్బరాజు చేయనున్న ఈ మూవీ గురించి ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది. శ్రీ విష్ణు- రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా డిసెంబర్ లేదా జనవరి నుంచి షూటింగ్ మొదలవనుందని, ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తూనే దానికి క్రైమ్ టచ్ ఇవ్వనున్నారట డైరెక్టర్.
ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు కామెడీ టచ్
ఎప్పుడూ కొత్తగా ట్రై చేసే శ్రీవిష్ణు ఈసారి కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మాత్రమే కాకుండా కాస్త కొత్తగా దానికి క్రైమ్ టచ్ ఇస్తూ ఆడియన్స్ ను అలరించాలని చూస్తున్నారట. నిజం చెప్పాలంటే ఈ జానర్ ను ఎంచుకుని శ్రీవిష్ణు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఈ జానర్ లో సినిమా చేయడం వల్ల అటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటూ ఇటు క్రైమ్ థ్రిల్లర్లు నచ్చే ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే ఛాన్స్ ఉంటుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే.
