ఎర్రన్న కనెక్షన్ తో యువ హీరో కథ
టాలీవుడ్ యంగ్ హీరో, ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
By: M Prashanth | 6 Oct 2025 11:35 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో, ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన వెర్సటైల్ పెర్ఫార్మెన్స్, యూనిక్ కథలతో ఎప్పటికప్పుడు తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తుంటారు. ప్రతి సినిమాలో కూడా హ్యూమర్ ఉండేలా చూసుకుని అన్ని వర్గాల సినీ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు.
గత ఏడాది సింగిల్ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. కలెక్షన్స్ పరంగా హైయ్యెస్ట్ బెంచ్ మార్క్ సాధించారు. ఇప్పుడు మృత్యుంజయ మూవీ చేస్తున్నారు. రీసెంట్ గా దసరా పండుగ స్పెషల్ గా తన మరో కొత్త సినిమా టైటిల్ ను కామ్రేడ్ కల్యాణ్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో నక్సలైట్ గా శ్రీవిష్ణు కనిపించనున్నారు.
90స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్- కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో సాగే కథతో రూపొందుతున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా కంప్లీట్ అయింది. మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. దీంతో మేకర్స్ వరుస అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే ఇప్పుడు మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ మారింది. కామ్రేడ్ కల్యాణ్ సినిమాలో శ్రీవిష్ణు.. ఆర్.నారాయణమూర్తి ఫ్యాన్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఎర్రన్న నారాయణమూర్తి చిత్రాలను చూస్తూ పెరిగిన ఓ యువకుడు.. నక్సలైట్ గా ఎందుకు మారాడనే పాయింట్ తో సినిమా రూపొందుతున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
కాగా, సినిమాలో శ్రీవిష్ణు డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఓ లుక్ స్టైలిష్ గా.. మరో లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని టైటిల్ రివీల్ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఆయన సరసన సినిమాలో మహిష్మా నంబియార్ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్.. మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఉపేంద్ర లిమాయే మరో పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. టామ్ చాకో విలన్ గా నటిస్తుండగా.. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్ పీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
