శ్రీముఖి 'మ్యాడ్' మేకోవర్.. ఈ ఘాటైన పోజులు చూశారా..
బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి, ఇప్పుడు తన లుక్స్‌తో ఇంటర్నెట్‌లో సెగలు పుట్టిస్తోంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే ఫ్యాషన్ విషయంలో తన రూట్ పూర్తిగా మార్చేసినట్లు అనిపిస్తోంది.
By: M Prashanth | 17 March 2026 10:41 PM ISTబుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి, ఇప్పుడు తన లుక్స్‌తో ఇంటర్నెట్‌లో సెగలు పుట్టిస్తోంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే ఫ్యాషన్ విషయంలో తన రూట్ పూర్తిగా మార్చేసినట్లు అనిపిస్తోంది. వైట్ బ్లేజర్, జీన్స్‌లో ఆమె ఇస్తున్న ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీముఖి కేవలం యాంకర్‌గానే కాకుండా, తన స్టైల్ స్టేట్‌మెంట్‌తో నేటి జనరేషన్ ఆడియన్స్‌ను ఇన్‌స్పైర్ చేస్తోంది.
ఈ ఫోటోషూట్‌లో శ్రీముఖి మేకోవర్ చాలా వెరైటీగా ఉంది. విరబోసిన జుట్టు, కళ్ళజోడుతో ఆమె ఇస్తున్న ఫోజులు ఒక పర్ఫెక్ట్ 'మ్యాడ్' వైబ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ, ఇప్పుడు చాలా ఫిట్‌గా తయారై అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతిగా ఆభరణాలు వాడకుండా, సింపుల్ మేకప్‌తోనే తన గ్లామర్‌ను ఎలివేట్ చేసిన తీరు బాగుంది. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేయాలనే ఆమె తపన ఈ క్లిక్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
శ్రీముఖి కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆమె పట్టుదల ఏంటో అర్థమవుతుంది. పటాస్ షోతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆమె, తన ఎనర్జిటిక్ యాంకరింగ్‌తో టాలీవుడ్‌లో టాప్ యాంకర్లలో ఒకరిగా నిలిచింది. బిగ్ బాస్ షోలో రన్నరప్‌గా నిలిచి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. బుల్లితెరపై నంబర్ వన్ యాంకర్‌గా రాణిస్తూనే, సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ప్రస్తుతం శ్రీముఖి తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా ప్లాన్డ్‌గా ముందుకు తీసుకెళ్తోంది. కేవలం షోలు మాత్రమే కాకుండా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా లక్షల మంది ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, స్పెషల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంటూనే, గ్లామర్ పరంగా తనను తాను హైలెట్ చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త లుక్స్‌తో మెరిసిపోతూ ఇండస్ట్రీలో తన ప్రాధాన్యత తగ్గకుండా చూసుకుంటోంది.
ఒక యాంకర్‌గా మొదలై తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. శ్రీముఖిలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్, హుందాతనం ఆమెను అందరి కంటే భిన్నంగా చూపిస్తాయి. గ్లామర్‌ను కేవలం స్కిన్ షోలా కాకుండా, ఒక ఆర్ట్‌లా ప్రెజెంట్ చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ఇప్పుడు ఆమె ఫ్యాన్స్‌కు కన్నుల పండుగగా మారాయి. ఇక భవిష్యత్తులో అమ్మడు ఇంకా సర్ ప్రైజ్ లు ఇస్తుందో చూడాలి.
