Begin typing your search above and press return to search.

ట్రాన్స్‌పరెంట్ టాప్ లో అందాలతో గిలిగింతలు పెడుతున్న యాంకర్!

అందులో భాగంగానే తాజాగా బ్లూ కలర్ ట్రాన్స్‌పరెంట్ టాప్ ధరించిన ఈమె దీనికి కాంబినేషన్లో జీన్స్ ప్యాంటు ధరించింది.

By:  Madhu Reddy   |   20 Sept 2025 6:24 PM IST
ట్రాన్స్‌పరెంట్ టాప్ లో అందాలతో గిలిగింతలు పెడుతున్న యాంకర్!
X

సినీ హీరోయిన్ మాత్రమే కాదు బుల్లితెర యాంకర్స్.. బుల్లితెర నటీనటులు కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అటు సీరియల్స్ లో నటించే నటీమణుల విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఇప్పుడు పలు షోల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని యాంకర్ గా సత్తా చాటుతూ పేరు తెచ్చుకున్న లేడీ యాంకర్స్ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు. అలాంటి వారిలో శ్రీముఖి కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఈమె ఛానల్ తో సంబంధం లేకుండా అవకాశం వచ్చిన ప్రతి షోలో పాల్గొంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

ముఖ్యంగా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో హోస్ట్ గా వ్యవహరించడమే కాకుండా అవార్డు ఫంక్షన్లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాదు సినిమా ఈవెంట్లకి కూడా స్పెషల్ గా హోస్టింగ్ చేస్తూ భారీగా సంపాదిస్తోంది అని కూడా చెప్పవచ్చు. బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న శ్రీముఖి.. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి కామనర్స్ సెలక్షన్ కోసం ఏర్పాటుచేసిన అగ్నిపరీక్ష అనే మినీ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరించింది. ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అటు సాంప్రదాయంగా ఆకట్టుకుంటూనే ఇటు గ్లామర్ షో చేస్తూ రెండు వర్గాల అభిమానులను అలరిస్తోంది శ్రీముఖి.

అందులో భాగంగానే తాజాగా బ్లూ కలర్ ట్రాన్స్‌పరెంట్ టాప్ ధరించిన ఈమె దీనికి కాంబినేషన్లో జీన్స్ ప్యాంటు ధరించింది. ఈమె మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేయడం కోసం వైట్ కలర్ షూస్ ధరించిన శ్రీముఖి స్టైలిష్ గా ఉండడం కోసం గ్లాసెస్ కూడా ధరించింది. పైగా తన మేకోవర్ ను సింపుల్ జువెలరీ తో ఫుల్ ఫిల్ చేసింది అని చెప్పవచ్చు. మొత్తానికైతే శ్రీముఖి ట్రెండింగ్ అవుట్ ఫిట్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ టాప్ ధరించేసరికి అందాలతో అభిమానులే కాదు ఫాలోవర్స్, నెటిజన్స్ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. అలా ఎప్పటికప్పుడు ఫ్యాషన్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది శ్రీముఖి. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్న ఈ చిన్నది.. బుల్లితెర రాములమ్మగా భారీ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

శ్రీముఖి కెరియర్ విషయానికి వస్తే.. అదుర్స్ అనే షో ద్వారా హోస్ట్ గా కెరియర్ ను ప్రారంభించిన శ్రీముఖి.. 2012లో అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె.. నేను శైలజ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ధనలక్ష్మి తలుపు తడితే, సావిత్రి వంటి చిత్రాలలో నటించింది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.