డాక్టర్ ప్లస్ యాక్ట్రెస్ అల్ట్రా స్టైలిష్ లుక్ వైరల్
శ్రీలీల లండన్ వింబుల్డన్ కోర్టుకు విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని..వింబుల్డన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా తనకు ఘనస్వాగతం పలుకుతూ ప్రత్యేక ఫోటోలను షేర్ చేయడం విశేషం.
By: Sivaji Kontham | 9 July 2026 11:53 PM ISTటాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం లండన్‌లో సందడి చేస్తున్నారు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ - 2026 టెన్నిస్ టోర్నమెంట్‌ను వీక్షించేందుకు వెళ్లిన ఈ యంగ్ హీరోయిన్.. అక్కడ దిగిన కొన్ని క్యూట్ అండ్ స్టైలిష్ ఫోటోలను తన ఇన్‌స్టా వేదికగా అభిమానులకు షేర్ చేసారు. ``శ్రీలీల డే అవుట్ ఎట్ వింబుల్డన్`` అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ లుక్‌లో క్యూటీ ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌లో శ్రీలీల అడుగుపెట్టడం తన కెరీర్‌లో మర్చిపోలేని ఘట్టం. వింబుల్డన్ టోర్నీలో భారతీయ గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ ఫస్ట్ ఎవర్ అప్పీయరెన్స్ అంతర్జాతీయ సెలబ్రిటీల సరసన నిలబెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లను వీక్షించడానికి శ్రీలీల తన తల్లితో కలిసి విచ్చేశారు. వింబుల్డన్ ట్రెడిషనల్ ఫ్యాషన్‌కు సరిపోయేలా క్లాసిక్ - కాంటెంపరరీ స్టైల్‌లో కనిపించి అందరినీ కట్టిపడేశారు.
శ్రీలీల లండన్ వింబుల్డన్ కోర్టుకు విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని..వింబుల్డన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా తనకు ఘనస్వాగతం పలుకుతూ ప్రత్యేక ఫోటోలను షేర్ చేయడం విశేషం. క్వార్టర్ ఫైనల్స్ లోని ఉద్వేగభరిత వాతావరణాన్ని ఆస్వాధిస్తూ శ్రీలీల ధరించిన `నేవీ-బ్లూ పిన్‌స్ట్రైప్ ప్యాంట్‌సూట్` ఫ్యాషన్ ప్రియులను తెగ ఇంప్రెస్ చేస్తోంది. ఓవర్‌సైజ్డ్ డబుల్ బ్రెస్ట్ బ్లేజర్.. వైడ్-లెగ్ ట్రౌజర్స్, వైట్ హ్యాండ్‌బ్యాగ్‌తో ఆమె అల్ట్రా స్టైలిష్‌గా మెరిసిపోయారు.
ఈ ఫోటోలపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శ్రీలీల కేవలం స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కూడా కావడంతో నెటిజన్లు తనను డాక్టర్ ప్లస్ యాక్ట్రెస్ అంటూ కొనియాడారు. వెండితెరపై ఎనర్జిటిక్ పాత్రలతో మెప్పించే శ్రీలీల.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఇంతటి క్లాసిక్, గ్లోబల్ ఫ్యాషన్ పర్సనాలిటీగా ఎదగడంపై ఫ్యాషన్ లవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. విభిన్నమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ ఇలా టెన్నిస్ కోర్టులో మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తూ కనిపించడం ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రతి సంవత్సరం వింబుల్డన్ టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా దిగ్గజాలను.. ఇండస్ట్రీ ప్రముఖులను ఆకర్షిస్తుంది. ఈ ఏడాది క్వార్టర్ ఫైనల్స్ 10వ రోజున హాలీవుడ్ నటి ఎల్ ఫానింగ్... `ది క్రౌన్` స్టార్ డొమినిక్ వెస్ట్, ప్రముఖ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్, క్వీన్ కెమిల్లా, జారా టిండాల్, మైక్ టిండాల్ , పాప్ సింగర్ గేరి హాలీవెల్-హార్నర్ వంటి గ్లోబల్ ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు మన టాలీవుడ్ స్టార్ శ్రీలీల కూడా వింబుల్డన్ గ్యాలరీలో మెరవడంతో ఈ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వీక్షకులకు చాలా స్పెషల్ గా మారిపోయింది. శ్రీలీల ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ సరసన ఓ చిత్రంలో నటిస్తుండగా, సైఫ్ ఖాన్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన నటించిన సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళంలోను శ్రీలీల వరుసగా కథల్ని ఫైనల్ చేస్తోందని సమాచారం.
