Begin typing your search above and press return to search.

శ్రీలీల వర్సెస్ ఆలియా భట్.. బాలీవుడ్ లో పీఆర్ స్టంట్స్

అయితే శ్రీలీలకు బీ టౌన్ లో తొలి సినిమాకే బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది. బ్యూటీ ఆలియా భట్ కీలక పాత్రలో నటిస్తున్న ఆల్ఫా సినిమా కూడా అదే రోజు థియేటర్లలోకి రానుంది.

By:  M Prashanth   |   17 Aug 2025 4:29 PM IST
శ్రీలీల వర్సెస్ ఆలియా భట్.. బాలీవుడ్ లో పీఆర్ స్టంట్స్
X

డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల టాలీవుడ్, శాండల్ వుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ ప్రారంభంలో మంచి హిట్లు అందుకున్న ఈ అమ్మడు కొద్ది రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు వెళ్లింది. హిందీలో శ్రీలీల ఆషికి 3సో అక్కడి డెబ్యూ చేయనుంది.

ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ ట్రీట్‌ గా 2025 డిసెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. అయితే శ్రీలీలకు బీ టౌన్ లో తొలి సినిమాకే బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది. బ్యూటీ ఆలియా భట్ కీలక పాత్రలో నటిస్తున్న ఆల్ఫా సినిమా కూడా అదే రోజు థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

అయితే రెండు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ ముందుకు రానుండడంతో ఆయా మూవీటీమ్స్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లనున్నాయి. అసలే బాలీవుడ్ అంటేనే పీ ఆర్ మేనేజ్ మెంట్లతో నడుస్తుంది. సినిమా రిలీజ్ కు ముందు పీఆర్ స్టంట్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. ఈ వ్యూహాలతోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ పీఆర్ సంస్థలు ఇప్పుడు శ్రీలీల- ఆలియాకు ఫేస్ టు ఫేస్ ఫైట్ గా చూపిస్తున్నాయి. ఆలియా కంటే ఎక్కువగా వైరల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో హీరో కార్తీక్ ఆర్యన్తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లు పీఆర్ ఏజెన్సీలు స్టంట్ చేశాయి. ఈవెంట్లలో, రెస్టారెంట్లలో వీళ్లిద్దరు కనిపించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ చేసేశారు. అంతేకాకుండా.. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని కథనాలు కూడా సృష్టించారు. ఇప్పటికీ అలాంటి స్టోరీలు పుట్టుకొస్తున్నాయి.

కానీ, దీనిపై అటు కార్తిక్ కానీ, ఇటు శ్రీలీల కానీ అధికారికంగా స్పందించలేదు. అయితే, వారి గురించి నిరంతరాయంగా కథలు రాస్తున్నప్పటికీ, ఇద్దరు స్టార్లలో ఎవరూ ప్రేమ ఊహాగానాల గురించి నోరు విప్పలేదు.

కాగా, ఆలియా భట్ కీలక పాత్రలో శివ్ రవైల్ ఆల్ఫా సినిమాను స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆలియాతో పాటు శర్వరి కూడా నటిస్తుంది. ఇది యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానుంది. అయితే యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఆల్ఫా సినిమా మహిళా ప్రధాన పాత్ర ఉన్న తొలి చిత్రం కానుంది.