Begin typing your search above and press return to search.

వీడియో : బుట్టబొమ్మగా కిస్సిక్‌ బ్యూటీ

రాఘవేంద్రరావు కొత్త 'పెళ్లి సందడి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల.

By:  Ramesh Palla   |   4 Sept 2025 12:25 PM IST
వీడియో : బుట్టబొమ్మగా కిస్సిక్‌ బ్యూటీ
X

రాఘవేంద్రరావు కొత్త 'పెళ్లి సందడి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఫ్లాప్‌ అయినా కూడా లక్ కలిసి వచ్చింది. పైగా రాఘవేంద్ర రావు మెచ్చిన హీరోయిన్‌ కావడంతో ఆ తర్వాత కూడా ఆఫర్లు వచ్చాయి. పెళ్లి సందడితో దక్కని హిట్‌ రవితేజతో చేసిన 'ధమాకా' సినిమాతో దక్కింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల జాబితాలో నిలిచింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో శ్రీలీల ఒక్కసారిగా స్టార్‌ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ఆకట్టుకునే అందంతో పాటు, డాన్స్‌లో ప్రతిభ ఉన్న హీరోయిన్‌ కావడంతో శ్రీలీలకు ధమాకా తర్వాత ఒక్కసారిగా ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అదే స్థాయిలో విజయాలు కూడా ఈమెకు దక్కాయి.


పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీ

మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమా నిరాశ పరిచిన మరిన్ని సినిమాలు ఈమె స్థాయిని పెంచాయి. హిట్‌.. ఫ్లాప్స్‌ అనే తేడా లేకుండా ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్‌ సినిమా ఆఫర్లు దక్కించుకుంది, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏడాదికి నాలుగు అయిదు, అంతకు మించి సినిమాలతోనూ ఈ అమ్మడు వచ్చింది. శ్రీలీల ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా సినిమాలు చేస్తోంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమాలో కిస్సిక్‌ అంటూ ఐటెం సాంగ్‌ చేయడంతో ఒక్కసారిగా ఈ అమ్మడి క్రేజ్ పెరిగింది. హిందీ, తమిళ్‌ ఇలా అన్ని భాషల్లోనూ ఈ అమ్మడికి గుర్తింపు దక్కింది. అక్కడ కిస్సిక్‌ బ్యూటీ అనే పేరును దక్కించుకుంది. అందుకే ఇప్పటికే బాలీవుడ్‌లో ఆషికి 3 సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోకు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే.

అందమైన లుక్‌లో శ్రీలీల

సినిమాలతో చాలా బిజీగా ఉన్న శ్రీలీల రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు, వీడియోలు షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అవుతూ ఉంటుంది. తాజాగా మేకప్ ఆర్టిస్ట్‌ ఒకరు ఈ వీడియోను షేర్‌ చేశారు. వీడియోలో శ్రీలీల చాలా అందంగా కనిపించడంతో పాటు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సాంప్రదాయ వస్త్రాలతో శ్రీలీల ఆకట్టుకుంది. బుట్ట బొమ్మ మాదిరిగా కనిపిస్తున్న శ్రీలీల ను చూస్తూ ఉంటే చూపు తిప్పలేక పోతున్నాం అంటున్నారు. ఒక యాడ్‌ షూటింగ్‌ నిమిత్తం ఇలాంటి ఔట్ ఫిట్‌ లో శ్రీలీల రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ యాడ్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి. సినిమాల్లోనూ అప్పుడప్పుడు ఇలాంటి లుక్‌ లో కనిపించాలని అభిమానులతో పాటు, సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే వారు, లైక్ చేసే వారు అంటున్నారు.

స్కిన్‌ షో చేయకుండానే శ్రీలీల వైరల్‌..

చెవులకు పెద్ద బుట్టాలు పెట్టి, పెద్ద మాటీలు ధరించడం ద్వారా పద్దతైన అమ్మాయిగా అనిపిస్తుందని, అంతే కాకుండా చీర కట్టు కారణంగా మరింత అందంగా కనిపిస్తుందని అంటున్నారు. సాధారణంగా హీరోయిన్స్ స్కిన్ షో చేస్తేనే నెటిజన్స్ పట్టించుకుంటారు. కానీ ఈ వీడియోలో శ్రీలీల పెద్దగా స్కిన్‌ షో చేయలేదు, కనీసం ఈమె నడుము అందం కూడా చూపించలేదు. అయినా కూడా చాలా క్యూట్‌గా, బుట్టబొమ్మ మాదిరిగా ఉండటంతో చాలా మంది తెగ లైక్ చేస్తూ షేర్‌ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఈ వీడియోను షేర్‌ చేసిన వారి సంఖ్య భారీగా పెరిగింది. అందమైన శ్రీలీల ఎలాంటి ఔట్‌ ఫిట్ లో అయినా, ఎలాంటి మేకోవర్‌లో అయినా భలే ఉంటుంది అని ఈ వీడియో చూస్తే మరోసారి కన్ఫర్మ్‌ అయింది అంటూ అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.