Begin typing your search above and press return to search.

శ్రీలీల.. ఆ డిస్కషన్ ఏంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

By:  M Prashanth   |   22 March 2026 12:00 AM IST
శ్రీలీల.. ఆ డిస్కషన్ ఏంటి?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద స్టేబుల్ గా కొనసాగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఆ సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ అందించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల, రాశీ ఖన్నా నటించారు. కానీ కథలో ప్రధానంగా శ్రీలీల పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కింది. లీల అనే రేడియో జాకీ పాత్రలో ఆమె కనిపించి తన అందం, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా సెకండాఫ్‌ లో కథ ఆమె చుట్టూ తిరగడం, పవన్ కళ్యాణ్‌ తో ఆమెకు ఉన్న సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

అలాగే ఈ మనసే.. పాట రీమిక్స్‌ లో శ్రీలీల చేసిన డ్యాన్స్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌ గా నిలిచింది. తన స్టైలిష్ ప్రెజెన్స్, యూత్‌ ఫుల్ ఎనర్జీతో సినిమా మొత్తం మీద కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్‌ ను థియేటర్లకు రప్పించడంలో ఆమె పాత్ర కీలకంగా మారిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

అయితే మరోవైపు, శ్రీలీల నటనపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె భావోద్వేగాలను పూర్తి స్థాయిలో వ్యక్తపరచలేకపోయిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సీరియస్ సీన్స్‌ లో కనెక్ట్ అవ్వడంలో తక్కువగా కనిపించిందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కథలోని కొన్ని సీన్స్ శ్రీలీల, రాశీ ఖన్నా మధ్య మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

రాశీ ఖన్నా తన అనుభవంతో కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించేదని కొందరు సినీ ప్రియులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ల రోల్స్ కేటాయింపుపై చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి శ్రీలీల పాత్ర ఆ సినిమాలో కీలకంగా నిలిచినప్పటికీ, ఆమె నటనపై మిక్స్ డ్ రెస్పాన్స్ రావడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఆమె ఎనర్జీతోపాటు స్క్రీన్ ప్రెజెన్స్‌ ను మెచ్చుకుంటుండగా, మరోవైపు యాక్టింగ్ లో ఇంకా మెరుగుదల అవసరమని సూచనలు వస్తున్నాయి.

ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల యాక్టింగ్ పై కొనసాగుతున్న ఆ చర్చ, ఆమె ఫ్యూచర్ సినిమాలపై కూడా ఆసక్తిని పెంచుతోంది. ఇప్పుడు ప్రేక్షకుల అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని, నటిగా మరింత మెరుగుపడితే ఆమెకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయని కొందరు సినీ ప్రియులు చెబుతున్నారు. మొత్తానికి ఉస్తాద్ తర్వాత శ్రీలీల యాక్టింగ్ పై చర్చ జరగడం గమనార్హం.