Begin typing your search above and press return to search.

శ్రీలీల ప‌చ్చ కోక‌ వైబ్స్.. అభిమానుల హంగామా పీక్స్!

దక్షిణాది చిత్రసీమలో తనదైన అద్భుత‌ నటన, గ్రేస్‌ఫుల్ డాన్స్‌తో స్వల్ప వ్యవధిలోనే అపారమైన క్రేజ్ సంపాదించుకున్న నటి శ్రీలీల.

By:  Sivaji Kontham   |   31 Oct 2026 10:54 PM IST
శ్రీలీల ప‌చ్చ కోక‌ వైబ్స్.. అభిమానుల హంగామా పీక్స్!
X

దక్షిణాది చిత్రసీమలో తనదైన అద్భుత‌ నటన, గ్రేస్‌ఫుల్ డాన్స్‌తో స్వల్ప వ్యవధిలోనే అపారమైన క్రేజ్ సంపాదించుకున్న నటి శ్రీలీల. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ హంగామా అంతా ఇంతా కాదు. లీల‌ ఏ కొత్త పోస్ట్ షేర్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవ్వడం సహజమే. తాజాగా ఈ డ్యాన్సింగ్ బ్యూటీ షేర్ చేసిన ఫోటోల‌కు కూడా నెటిజన్ల నుండి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఆ ప‌చ్చ రంగు కోక‌లో లీల అదుర్స్! అంటూ ఫ్యాన్స్ జోరుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కామెంట్స్ విభాగాన్ని పరిశీలిస్తే... శ్రీ‌లీల‌పై అభిమానులకు ఉన్న అపరిమితమైన ప్రేమ, అభినందనలు స్పష్టంగా కనిపిస్తాయి. మెజారిటీ కామెంట్లు హార్ట్, ఫైర్ ఎమోజీలతో నిండిపోగా.. సాధారణ అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన తోటి నటీనటులు (రాశీ ఖన్నా వంటివారు) కూడా త‌న‌ రూపాన్ని మెచ్చుకుంటూ అప్సరస, ఏంజెల్ అని ప్రశంసల వర్షం కురిపించారు.





ఈ సోషల్ మీడియా హంగామాలో ప్రధానంగా శ్రీలీల ధరించిన సాంప్రదాయ ఆకుపచ్చ రంగు చీర.. ఇటీవలి తుమకూరు పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందాల భ‌రిణె కట్టు బొట్టును పొగుడుతూ అభిమానులు మురిసిపోయారు. కర్ణాటకలోని తుమకూరులో ఒక ప్రైవేట్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ ఈవెంట్ కోసం శ్రీలీల హాజరవగా.. త‌న‌ను స్వయంగా చూడటానికి ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడ శ్రీ‌లీల‌ కనిపించిన తీరు .. ఆ ఫోటోల‌ను సోషల్ మీడియాలో `తుముకూరు వైబ్స్` పేరుతో విపరీతంగా వైర‌ల్ అయ్యాయి. ఇదే క్రమంలో కొందరు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపారు.





కేవలం అందాన్ని పొగడటమే కాకుండా శ్రీలీల సినీ కెరీర్‌పై ఉన్న అభిమానంతో కొందరు నెటిజన్లు అత్యంత కీలకమైన సూచనలు చేశారు. మళ్లీ కన్నడ చిత్రసీమలో సినిమాలు చేసి అలరించాలని స్థానిక అభిమానులు ఆకాంక్షించగా.. మరికొందరు మాత్రం కేవలం వరుస సినిమాలు ఒప్పుకుంటూ పోవడం కంటే.. మంచి స్క్రీన్ టైమ్, కథలో ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవాలని హితవు పలికారు. అభిమానుల ఈ సలహాలు త‌న‌ కెరీర్ విష‌యంలో ఫ్యాన్స్ కు ఉన్న బాధ్యతను, శ్రీలీల భవిష్యత్తుపై వారికి ఉన్న ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి.





ప్రస్తుతం శ్రీలీల తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా తమిళం, హిందీ చిత్ర పరిశ్రమలలో వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా మారి పాన్ ఇండియా స్థాయిలో తనదైన‌ ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. తమిళంలో `అమరన్` ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్‌లో వస్తున్న `ఓమ్` చిత్రంలో శ్రీలీల నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సాయి పల్లవి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. తమిళంలో లీల‌కు ఇది ఒక మైలురాయి లాంటి ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది.





మరోవైపు బాలీవుడ్‌లోకి కూడా శ్రీలీల గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ హిందీ దర్శకుడు అనురాగ్ బాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక ప్రతిష్టాత్మక చిత్రంలో ఈ క్యూటీ కథానాయికగా న‌టిస్తోంది. దీనితో పాటు బాలీవుడ్ దర్శకుడు ఉమేష్ బిష్త్ ప్రాజెక్ట్‌లో కూడా ఒక కంటెంట్ ఓరియెంటెడ్- లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్నారు. ఇలా ప‌లు భాషల్లో వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతున్న శ్రీలీల సోషల్ మీడియా ట్రెండ్స్ నుండి సిల్వర్ స్క్రీన్ వరకు అంతటా తన హవా కొనసాగిస్తున్నారు.