Begin typing your search above and press return to search.

శ్రీలీల‌ను ప‌వ‌ర్‌స్టార్ అయినా బ‌య‌ట‌పడేస్తాడా?

టాలీవుడ్‌లో వేగంగా ఎదిగిన యంగ్ హీరోయిన్‌లలో ఒకరైన శ్రీలీల ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాస్త కఠినమైన దశను ఎదుర్కొంటున్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి

By:  Sravani Lakshmi Srungarapu   |   18 March 2026 8:31 PM IST
శ్రీలీల‌ను ప‌వ‌ర్‌స్టార్ అయినా బ‌య‌ట‌పడేస్తాడా?
X

టాలీవుడ్‌లో వేగంగా ఎదిగిన యంగ్ హీరోయిన్‌లలో ఒకరైన శ్రీలీల ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాస్త కఠినమైన దశను ఎదుర్కొంటున్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతంలో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి, రీసెంట్ గా రిలీజైన సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాల్ని ఇవ్వలేదు. మ‌హేష్ బాబు తో ఆమె చేసిన గుంటూరు కారం సినిమా యావ‌రేజ్ కంటే మెరుగ్గా ఉన్న‌ప్ప‌టికీ, బ్లాక్ బ‌స్ట‌ర్ గా మాత్రం నిల‌వ‌లేదు.

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న శ్రీలీల

ఆ తర్వాత వచ్చిన జూనియ‌ర్ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. ట్రేడ్ సర్కిల్స్ ఆ సినిమాను ఫ్లాపుగా అనౌన్స్ చేశాయి. దీంతో త‌ర్వాతి ప్రాజెక్టుల‌తో ఆమె కెరీర్ మ‌రింత కఠినమైంది. రాబిన్‌హుడ్, మాస్ జాత‌ర‌, ప‌రాశ‌క్తి లాంటి సినిమాలు వ‌రుస‌గా డిజాస్ట‌ర్ ట్యాగ్ ను దక్కించుకోవడం గమనార్హం. ఈ మూడు సినిమాల పరాజయం శ్రీలీల కెరీర్‌పై స్పష్టమైన ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే, ఇప్పుడు శ్రీలీల‌కు ఓ భారీ హిట్ అవ‌స‌రం.

ఈ ఫలితాలు పూర్తిగా శ్రీలీలపై ఆధారపడినవి కాన‌ప్ప‌టికీ, స్క్రిప్ట్ ఎంపికలు, కథల బలహీనత, అలాగే మార్కెట్ పరిస్థితులు కూడా ప్రభావం చూపించాయని చెబుతున్నారు. అయినప్పటికీ, హీరోయిన్ల విషయంలో బాక్సాఫీస్ ఫలితాలు చాలా కీలకం కావడంతో, ఈ వరుస ఫ్లాపులు ఆమె కెరీర్‌కు తాత్కాలిక బ్రేక్ వేసినట్టే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలీల ఇప్పుడు త‌న‌ ఆశ‌ల‌న్నింటినీ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ పైనే పెట్టుకుంది.

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో కలిసి నటిస్తున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందని, ఆమెకు మరోసారి తన టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం లభించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి స్టార్ హీరోతో జత కట్టడం, పెద్ద స్థాయి ప్రాజెక్ట్‌లో భాగమవడం ఆమెకు మళ్లీ బలమైన కంబ్యాక్‌కు దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి వరుస ఫ్లాపుల త‌ర్వాత ఒక పెద్ద హిట్ అవసరమైన దశలో ఉన్న శ్రీలీలకు ఉస్తాద్ భగత్ సింగ్ కీలకంగా మారింది. ఈ సినిమా స‌క్సెస్ అయితే, ఆమె కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడందరి దృష్టి ఈ సినిమాపైనే నిలిచింది. మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయినా శ్రీలీల‌ను ఫ్లాపుల నుంచి బ‌య‌ట‌ప‌డేస్తారేమో చూడాలి.