Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : పొట్టి డ్రెస్‌లో స్టైలిష్ శ్రీలీల

టాలీవుడ్‌లోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్న కారణంగా ఈమె పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. సోషల్‌ మీడియాలోనూ ఈమె సందడి భారీ ఎత్తున ఉంటుంది అనే విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   1 March 2026 5:00 PM IST
పిక్‌టాక్‌ : పొట్టి డ్రెస్‌లో స్టైలిష్ శ్రీలీల
X

'పెళ్లి సందడి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు మూలాలు ఉన్న హీరోయిన్ కావడంతో టాలీవుడ్‌లో ఈమెకు పెద్దగా ఆఫర్లు రావేమో అనే అనుమానం ను కొందరు వ్యక్తం చేశారు. కానీ ఈ అమ్మడు టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది. మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించడం ద్వారా ఈ అమ్మడు టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చేరి పోయింది. ఇక పుష్ప 2 లో ఈమె చేసిన ఐటెం సాంగ్‌ కారణంగా పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపును సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్న కారణంగా ఈమె పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. సోషల్‌ మీడియాలోనూ ఈమె సందడి భారీ ఎత్తున ఉంటుంది అనే విషయం తెల్సిందే.




వరుస సినిమాలతో శ్రీలీల బిజీ బిజీ...

హీరోయిన్‌గా శ్రీలీల వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదిలో శ్రీలీల మొదటగా పవన్‌ కళ్యాణ్‌తో నటించిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెలలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది. గత ఏడాది మూడు సినిమాలతో వచ్చిన శ్రీలీల ఈ ఏడాది మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈమె ఈ ఏడాది స్టార్‌ హీరో సినిమాలో ఐటెం సాంగ్‌లోనూ కనిపించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. మోడలింగ్‌ పై ఆసక్తితో శ్రీలీల రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. శ్రీలీల ఈ మధ్య కాలంలో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోందని అభిమానులు, సోషల్‌ మీడియా ఫాలోవర్స్ అంటున్నారు.




మిలన్‌ ఫ్యాషన్‌ షో లో శ్రీలీల...

ఇటీవల జరిగిన మిలన్ ఫ్యాషన్‌ వీక్‌లో శ్రీలీల పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఒనిట్సుకా టైగర్‌ బ్రాండ్‌కు సంబంధించిన కవర్‌ పేజీపై శ్రీలీల కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. సాధారణంగా సౌత్ హీరోయిన్స్‌ ఇండియన్ కంపెనీలకు మాత్రమే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. కానీ శ్రీలీల ఇలా అంతర్జాతీయ స్థాయి కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమెకు ఉన్న అందం, ఆమె యొక్క ప్రతిభ కారణంగానే ఇలా అంతర్జాతీయ స్థాయి బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం దక్కిందని ఆమె ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, ఆమె ఫోటోలకు ఫోజ్‌ ఇచ్చే విధానం సైతం ఆకట్టుకునే విధానం ఉంటుందని పలువురు అంటూ ఉంటారు.




ధనుష్ సినిమాలో శ్రీలీల...

మిలన్ వీధుల్లో శ్రీలీల ఫోటోలకు ఫోజ్ ఇచ్చి ఆకట్టుకుంది. పొట్టి డ్రెస్‌లోనూ శ్రీలీల చాలా ముద్దుగా అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫోటోలకు ఫోజ్‌లు ఇవ్వడం ద్వారా శ్రీలీల సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. సన్నగా నాజూకుగా ఉండే శ్రీలీల సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి అందమైన, స్టైలిష్ ఫోటో షూట్స్ ను షేర్ చేయడం ద్వారా అభిమానులకు కన్నుల విందు చేస్తుంది. శ్రీలీల ప్రస్తుతం హిందీలో అనురాగ్‌ బసు సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలోని ఈమె నటనకు మంచి ప్రశంసలు దక్కుతాయని ఆయన అంటున్నాడు. అంతే కాకుండా ఆ సినిమాతో బాలీవుడ్‌లో శ్రీలీల మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక తమిళ్‌ లో ఏకంగా ధనుష్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమాలో ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదిలోనే ఈ సినిమాలన్నీ విడుదల కానున్నాయి. కొత్తగా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.