Begin typing your search above and press return to search.

హిట్లు లేకపోయినా ఆ హీరోయిన్ డిమాండ్స్ మాత్రం త‌గ్గ‌ట్లేదుగా

తెలుగు సినీ పరిశ్రమలో త‌క్కువ కాలంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శ్రీలీల కెరీర్ ప్రస్తుతం కీలక దశలోకి చేరింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 April 2026 12:08 PM IST
హిట్లు లేకపోయినా ఆ హీరోయిన్ డిమాండ్స్ మాత్రం త‌గ్గ‌ట్లేదుగా
X

తెలుగు సినీ పరిశ్రమలో త‌క్కువ కాలంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శ్రీలీల కెరీర్ ప్రస్తుతం కీలక దశలోకి చేరింది. ప్రారంభంలో వరుస అవకాశాలు, క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్లిన ఆమె గ్రాఫ్, గత కొన్నేళ్లలో అనూహ్యంగా పడిపోయిందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గ‌త కొన్ని సినిమాలుగా శ్రీలీల నుంచి వ‌చ్చిన సినిమాల్లో ఒక్క భగవంత్ కేసరి త‌ప్ప మ‌రే సినిమా స‌క్సెస్ ను అందుకోలేదు. ఈ కార‌ణంగానే అమ్మ‌డికి టాలీవుడ్ లో ఛాన్సులు క‌రువ‌య్యాయి.

క‌థ‌ల ఎంపిక వ‌ల్లే..

శ్రీలీల ఎదుర్కొంటున్న ఈ ఫ్లాపుల‌ వెనుక ఎన్నో రీజ‌న్స్ చ‌ర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా స్టోరీ సెలెక్ష‌న్ లో చేసిన పొరపాట్లు, వీక్ స్క్రిప్ట్స్‌ను అంగీకరించడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా స్టార్ హీరోలతో చేసిన కాంబినేషన్స్ కూడా ఆశించిన మ్యాజిక్‌ను సృష్టించలేకపోయాయి. కొన్ని ప్రాజెక్టులు సరైన టైమింగ్‌లో రిలీజ్ కాకపోవడం, మార్కెట్ పరిస్థితులు కలిసి రాకపోవడం కూడా సినిమా రిజ‌ల్ట్స్ పై ప్రభావం చూపిన అంశాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలపై ఉన్న భారీ అంచనాలు నెరవేరకపోవడం, ఆమె కెరీర్‌కు మరింత దెబ్బతీసింది.

ఫ్లాపుల్లో ఉన్నా రెమ్యూన‌రేష‌న్ డిమాండ్

ఇక మరోవైపు రెమ్యూనరేషన్ అంశం కూడా హాట్ టాపిక్‌గా మారింది. వరుస ఫ్లాప్స్ ఉన్నప్పటికీ, శ్రీలీల రూ.3 కోట్ల వరకు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఎవ‌రి మార్కెట్ వాల్యూ అయినా హిట్ సినిమాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు రిస్క్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. టాలెంట్ ఉన్నా, బాక్సాఫీస్ ఫలితాలు లేకపోతే రేటు తగ్గించుకోవాల్సిందే అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ ఎంట్రీ ఆమెకు కీలక మలుపుగా మారనుంది. కార్తిక్ ఆర్యన్ తో ఆమె నటిస్తున్న సినిమా పై మంచి అంచనాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ స‌క్సెస్ అయితే, ఆమెకు కొత్త అవకాశాలు వ‌చ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిస్తే, శ్రీలీల‌ కెరీర్ మరింత క్లిష్ట దశలోకి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, కొంద‌రు ప్రముఖ నిర్మాతలు ప్రస్తుతం శ్రీలీలను ఎంపిక చేయడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ప్రధాన కారణం బాక్సాఫీస్ ఫలితాలు మరియు ప్రస్తుత మార్కెట్ ట్రెండ్. హీరోయిన్ మార్కెట్ విలువ అనేది కేవలం టాలెంట్‌తో కాకుండా, హిట్ రేషియో, ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధానం మరియు బ్యాంకబిలిటీపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమయంలో శ్రీలీల కెరీర్ ఒక క్రాస్‌రోడ్స్‌లో నిలిచినట్టే. టాలీవుడ్‌లో తగ్గిన అవకాశాలను బాలీవుడ్ ద్వారా తిరిగి సాధించగలదా? లేక ఈ దశను దాటడానికి ఆమెకు మరింత సమయం పడుతుందా? అనే ప్రశ్నలకు కార్తీక్ ఆర్య‌న్ తో చేయ‌బోయే సినిమానే స‌మాధానం ఇవ్వాలి.