శ్రీలీల అప్పుడు మిస్సైనా ఇప్పుడు మిస్ కాలేదు
కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీలీల ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 8 Aug 2025 3:00 PM ISTకన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీలీల ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుంది. శ్రీలీల నుంచి రీసెంట్ గా రిలీజైన కొన్ని సినిమాలు ఆమెకు అనుకున్న సక్సెస్ ను ఇవ్వకపోయినా అమ్మడికి ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. కేవలం తెలుగు లోనే కాకుండా పలు భాషల్లో తన సత్తా చాటుతోంది శ్రీలీల.
శ్రీలీల ఖాతాలో మరో క్రేజీ ఆఫర్
ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ సరసన ఉస్తాద్ భగత్‌సింగ్ తో పాటూ మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన విషయం తెలిసిందే. దాంతో పాటూ తమిళంలో సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న పరాశక్తిలో కూడా నటిస్తోంది. అయితే ఇప్పుడు శ్రీలీల తమిళంలో మరో క్రేజీ ఆఫర్ ను పట్టేసింది.
అజిత్ సినిమాలో ఛాన్స్
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తర్వాత అజిత్ కుమార్, అధిక్ రవిచంద్రన్ కలిసి మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. AK64 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. ఈ అక్టోబర్ నుంచి సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి 2026 సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తుండగా ఈ క్రేజీ ప్రాజెక్టులో శ్రీలీల స్థానం సంపాదించుకుంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ కాంబోలో సినిమా
అయితే శ్రీలీల ఈ సినిమాలో అజిత్ కు హీరోయిన్ గా నటించడం లేదట. అజిత్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ ఆ ఛాన్స్ కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టికి దక్కే అవకాశాలున్నాయని, ఈ విషయమై మేకర్స్ ఆమెతో డిస్కషన్స్ చేస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి శ్రీలీల అజిత్ తో కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీలోనే నటించాల్సింది. అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆఖరికి ఆ క్యారెక్టర్ ప్రియా ప్రకాష్ వారియర్ కు వెళ్లింది. ఈ సినిమాను కూడా గుడ్ బ్యాడ్ అగ్లీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సింది కానీ ఇప్పుడు AK64 ను రోమియో పిక్చర్స్ బ్యానర్ లో రాహుల్ నిర్మాతగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. చూస్తుంటే AK64 క్యాస్ట్ అండ్ క్రూ తోనే మరిన్ని అంచనాలు క్రియేట్ చేసేలా అనిపిస్తుంది.
