శ్రీలీల కెరీర్ లో తప్పెక్కడ జరుగుతోంది?
తెలుగు అమ్మాయి శ్రీలీల ట్యాలెంట్ తో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా బిజీ అవ్వాలి. కానీ అమ్మడికి నటిగా మాత్రం ఇంకా దక్కాల్సిన గుర్తింపు ఇంకా దక్కలేదు.
By: Srikanth Kontham | 19 Jan 2026 1:00 PM ISTతెలుగు అమ్మాయి శ్రీలీల ట్యాలెంట్ తో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా బిజీ అవ్వాలి. కానీ అమ్మడికి నటిగా మాత్రం ఇంకా దక్కాల్సిన గుర్తింపు ఇంకా దక్కలేదు. చెప్పుకోవడానికి 17 సినిమాల్లో నటించిన నటే అయినా? పేరు..గుర్తింపు మాత్రం అంతంగా మాత్రంగానే దక్కాయి అన్నది కాదనలేని నిజం. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మడు`కిస్` చిత్రంతో కన్నడలో హీరోయిన్ గా లాంచ్ అయింది. అటుపై `పెళ్లి సందడి` తో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే శ్రీలీల ట్యాలెంట్ బయట పడింది. నటనతో పాటు మంచి డాన్సర్ కూడా కావడంతో వెలుగులోకి వచ్చింది.
నటిగా మంచి భవిష్యత్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేసారు. పైగా తెలుగులో ఇంతటి ప్రతిభావంతురాలు ఈ మధ్య కాలంలో ఎవరూ రాలేదనే ఇమేజ్ కూడా శ్రీలీలపై పడింది. కానీ టాలీవుడ్ లో శ్రీలీల సినిమాలు చేసిన విధానం చూస్తే? వాటిలో గుర్తింపునిచ్చే పాత్రలు మూడు నాలుగు సినిమాలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి బాలయ్య హీరోగా నటించిన `భగవంత్ కేసరి`లో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత మరో మూడు నాలుగు సినిమాల్లో నటించిన పాత్రలకు మంచి పేరొచ్చింది.
టాలీవుడ్ పరంగా చూస్తే ఓ ఎనిమిది..తొమ్మిది సినిమాలు ఇప్పటికే చేసింది. మరి వీటి ద్వారా శ్రీలీల సాధించింది ఏంటి? అంటే పెద్దగా ఆశించిన ఫలితాలైతే కనిపించలేదు. అయితే ఈ విషయాన్ని శ్రీలీల చాలా ఆలస్యంగా గమనించింది. తన కెరీర్ లో తప్పు ఎక్కడ జరుగుతుందో ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగులో వచ్చిన అవకాశాలు కాదని హిందీ సహా ఇతర పరిశ్రమల్లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు సినిమాల్లో కంటున్యూ అయితే పూర్తి ఐటం పాటలకే పరిమితం అవ్వాల్సి వస్తుందని, గ్లామర్ బ్యూటీగానే పరిశ్రమ గుర్తు పెట్టుకునే ప్రమాదం ఉందని గ్రహించి ఇతర భాషల్లో తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
దీంతో కెరీర్ పరంగా గ్యాప్ వచ్చినా? పర్వాలేదు గానీ మంచి పాత్రలు మాత్రమే చేయాలని మైండ్ లో బలంగా ఫిక్స్ అయింది. ఆ కారణంగా తెలుగులో వచ్చిన కొన్ని అవకాశాలు కూడా కాదనుకుంది. తాజాగా శ్రీలీల ఫాలోవర్స్ , అభిమానులు కూడా మంచి సినిమాలు మాత్రమే చేయండని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీలీల నుంచి `ఊ అంటావా మావ` లాంటి పాటలకంటే ఆమెలో గొప్ప పెర్పార్మర్ ని మాత్రమే అభిమానులు కూడా చూడాలనుకుంటున్నారు అన్నది క్లియర్ గా అర్దమవుతుంది.
