లో గా అనిపిస్తే అదే చేస్తా!
టాలీవుడ్ మోస్ట్ హోపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు తన క్రేజ్ ను దేశవ్యాప్తంగా వ్యాపింప చేస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 11 Sept 2025 1:00 AM ISTటాలీవుడ్ మోస్ట్ హోపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు తన క్రేజ్ ను దేశవ్యాప్తంగా వ్యాపింప చేస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన శ్రీలీల, తర్వాత పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకుని కెరీర్ లో సక్సెస్‌ఫుల్ గా దూసుకెళ్తున్నారు శ్రీలీల.
పవన్ తో ఉస్తాద్ భగత్‌సింగ్ తో బిజీ
ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న లీల, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా లీల ఆ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే శ్రీలీల సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్, ఫాలోవర్ల కోసం కొంత టైమ్ ను కేటాయిస్తూనే ఉంటారు.
నిరుత్సాహంలో ఉన్న అభిమానికి శ్రీలీల సలహా
అందులో భాగంగానే శ్రీలీల తన ఇన్‌స్టాలో చాట్ సెషన్ నిర్వహించగా, అందులోని ఓ మెసేజ్ హైలైట్ గా నిలిచింది. శ్రీలీల కు ఓ ఫ్యాన్ చాలా నిరుత్సాహంగా ఉన్నానని చెప్తూ మెసేజ్ చేయగా, దానికి శ్రీలీల కొన్ని సలహాలిచ్చారు. ఈ విషయంలో నేను హెల్ప్ చేయగలనో లేదో తెలీదు కానీ వెంటనే వెళ్లి మీ ఫ్యామిలీ మెంబర్ ను హగ్ చేసుకోండి. నేనదే చేస్తానంటూ రాసుకొచ్చారు శ్రీలీల.
దాంతో పాటూ మంచి మ్యూజిక్ కూడా థెరపీలాగా పని చేస్తుందని, కాబట్టి మ్యూజిక్ వినమని లీల సూచించారు. శ్రీలీల తన ఫ్యాన్ కు ఇచ్చిన సలహాను అందరూ స్వాగతిస్తూ ఫ్యాన్ బాధపై ఆమె రెస్పాండ్ అయిన తీరుని ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే శ్రీలీల నటించిన మాస్ జాతర సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. శ్రీలీల కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో పరాశక్తి, బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
