శ్రీలీల లేడీ ఓరియేంటెడ్ అతడితోనా?
తెలుగు అమ్మాయి శ్రీలీల రూటు మార్చిందా? భవిష్యత్ కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది.
By: Srikanth Kontham | 21 Oct 2025 12:30 PM ISTతెలుగు అమ్మాయి శ్రీలీల రూటు మార్చిందా? భవిష్యత్ కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు ఒక్కసారిగా వాటిని పక్కన బెట్టిన వైనం తెలిసిందే. టాలీవుడ్ కంటే పరభాషలకే అమ్మడు పెద్ద పీట వేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ కి వెళ్లింది. టాలీవుడ్ లో అగ్ర హీరోలతో అవకాశాల కన్నా బాలీవుడ్ లో కుర్ర హీరోలు ఉత్తమం అనుకుని ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటికే అక్కడ రెండు..మూడు సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే.
స్టార్ లీగ్ లో చేరకుండానే:
అలాగే కన్నడ, తమిళ చిత్ర దర్శక, నిర్మాతలకు సొగసరి రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. తెలుగు దర్శక, నిర్మాతలు తనకు టచ్ లో ఉన్నా? శ్రీలీల మాత్రం ఇతర భాషలకు టచ్ లో ఉండటం ఇంట్రెస్టింగ్. ఇటీవలే ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. కానీ వాస్తవానికి శ్రీలీలకు ఇంకా సోలోగా సత్తా చాటే స్టామినా లేదు. హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఇంకా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరలేదు. అయినా సరే ఆ ఇమేజ్ తో సంబంధం లేకుండా లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు ఒకే చెప్పింది? అంటే శ్రీలీల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అన్నది అద్దం పడుతుంది.
తమిళ్ డైరెక్టర్ తో ప్రయత్నమా?
తనకు తానుగా స్వయంగా ఎదిగే ఆలోచన తనలో కనిపిస్తోంది. కేవలం స్టార్ హీరోల సరసన నటిస్తే వచ్చే ఇమేజ్ తో పని లేకుండా తనకు తానుగా సోలోగా ఎదగాలి అన్న తపన అమ్మడిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమెన్ సెంట్రి క్ చిత్రాన్ని లాక్ చేసింది. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలు తమిళ డైరెక్టర్ మిలింద్ రాజ్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో ఇతడు `కాదల్ టూ కల్యాణం`, `అవల్`, `నెట్రికన్` ,` ది విలేజ్` లాంటి చిత్రాలు డైరెక్ట్ చేసాడు. డైరెక్టర్ గా ఈ సినిమాలకు అతడికి మంచి పేరు తీసుకొచ్చాయి.
క్లారిటీ వచ్చేదెప్పుడు?
అందులో `ది విలేజ్ `అన్నది హారర్ చిత్రం. మంచి విజయం సాధించింది. మిగతా మూడు వేర్వేరు జానర్ చిత్రాలు. వాటి రిలీజ్ తర్వాత డైరెక్టర్ గా మాత్రం మిలింద్ బిజీ కాలేదు. పదేళ్ల కెరీర్ లో నాలుగు సినిమాలకే పరిమిత మయ్యారు. అలాంటి డైరెక్టర్ని శ్రీలీల తెరపైకి తీసుకు రావడం విశేషం. ఈ నేపథ్యంలో మిలింద్- శ్రీలీల కాంబినేషన్ లో వచ్చేది హారర్ థ్రిల్లర్ చిత్రమా? లేక మరో జానరా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉందని మాత్రమే శ్రీలీల తెలిపింది. డైరెక్టర్ ఎవరు? అన్నది కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
