Begin typing your search above and press return to search.

అబ్బా.. వెల్వెట్ లెహంగాలో మంత్రముగ్ధుల్ని చేస్తున్న శ్రీలీలా!

అందులో భాగంగానే తాజాగా బ్లూ కలర్ వెల్వెట్ హాఫ్ సారీ ధరించి తన అందాలతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.. ముఖ్యంగా ఈ వెల్వెట్ బ్లూ కలర్ ఆఫ్ శారీ శ్రీ లీల అందాలను మరింత రెట్టింపు చేసింది అని చెప్పవచ్చు.

By:  Madhu Reddy   |   29 Oct 2025 7:05 PM IST
అబ్బా.. వెల్వెట్ లెహంగాలో మంత్రముగ్ధుల్ని చేస్తున్న శ్రీలీలా!
X

ప్రముఖ హీరోయిన్ శ్రీ లీల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో.. అందంతో ఎంతోమంది కుర్రకారు హృదయాలు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో 'పెళ్లి సందD' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిజానికి ఈ సినిమాలో నటించడానికంటే ముందే కిరీటి రెడ్డి హీరోగా నటించిన 'జూనియర్ కి సినిమాకు సైన్ చేసింది. కానీ ఈ సినిమా ఆలస్యం కావడంతో పెళ్లి సందD సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ జూనియర్ సినిమా ఇటీవల విడుదల అయింది. పెళ్లి సందD తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో ఊహించని పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.





ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఎన్నో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ అవేవీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. పైగా కొన్ని చిత్రాల నుండి తప్పించారు కూడా. ఇప్పుడు మళ్లీ మాస్ మహారాజా రవితేజ తో మాస్ జాతర సినిమాలో నటిస్తోంది. నిజానికి ఈ ఏడాది గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా.. పలు కారణాలవల్ల వాయిదా పడింది. అక్టోబర్ 31న రిలీజ్ చేస్తామని కచ్చితంగా ప్రకటించారు. అయితే అదే రోజు బాహుబలి ది ఎపిక్ విడుదల కానున్న నేపథ్యంలో సినిమాను ఒకరోజు ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. అయితే అక్టోబర్ 31న ప్రీమియర్ షోలు మొదలు కానున్నాయి. నవంబర్ 1న సినిమా రిలీజ్ కాబోతోంది.





సినిమా సంగతి అటు ఉంచితే ఇప్పుడు ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. ఒకవైపు సినిమా ప్రమోషన్స్ చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పవచ్చు. అందులో భాగంగానే తాజాగా బ్లూ కలర్ వెల్వెట్ హాఫ్ సారీ ధరించి తన అందాలతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.. ముఖ్యంగా ఈ వెల్వెట్ బ్లూ కలర్ ఆఫ్ శారీ శ్రీ లీల అందాలను మరింత రెట్టింపు చేసింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.





శ్రీలీల విషయానికి వస్తే మాస్ జాతర సినిమాతో పాటు.. అరుంధతి 2 సినిమాలో కూడా లీడ్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరో తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇటు హిందీలో కూడా కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఒక లవ్ రొమాంటిక్ చిత్రంలో నటిస్తోంది శ్రీ లీల. మరొకవైపు మాస్ జాతర ప్రమోషన్స్ లో వేగంగా పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది. మొత్తానికి అయితే శ్రీ లీలా తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయని చెప్పవచ్చు.