హంగామా..ఆర్భాటం లేని తెలుగు హీరోయిన్!
ఆ మాత్రం సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి రారుబిజినెస్ మెన్ కుమార్తెలు..ఆర్మీ ఆఫీసర్ల కూతుళ్లు..రాజకీయ నాయకుల కూతుళ్లు కనిపిస్తుంటారు.
By: Srikanth Kontham | 29 Oct 2025 6:00 PM ISTహీరోయిన్లు అయ్యారంటే? వాళ్ల బ్యాక్ గ్రౌండ్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఆ మాత్రం సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి రారుబిజినెస్ మెన్ కుమార్తెలు..ఆర్మీ ఆఫీసర్ల కూతుళ్లు..రాజకీయ నాయకుల కూతుళ్లు కనిపిస్తుంటారు. దాదాపు అంతా హైఫై ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే ఉంటారు. వారి కెరీర్ ఎలా ఉండాలి? అన్నది స్కూల్ డేస్ లోనే డిసైడ్ అయిపోతుంది. అందుకు తగ్గట్టు ప్రణాళిక సిద్దం చేసుకుని తాము అనుకున్న రంగంవైపు వెళ్తుంటారు.అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వారంతా దాదాపు గోల్డ్ స్పూన్ అన్నట్లే ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టాలనేవి లేకుండా పెరుగుతారు.
శ్రీలీల వాళ్లకి భిన్నంగా:
కార్పోరేట్ స్కూల్స్..కాలేజీల్లో చదువులు ముగిస్తారు. అటుపై మోడలింగ్, యాడ్స్ అంటూ మెల్లగా సినిమాల్లోకి వస్తారు. నటిగా సక్సెస్ అవుతారా? లేదా? అన్నది తర్వాత సంగతి. హీరోయిన్ గా మ్యాకప్ వేసుకోవడం మాత్రం తప్పనిసరి. దాదాపు నార్త్ సహా సౌత్ లో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆ ప్రాంతాల నుంచి హీరోయిన్లగా దిగుమతి అయ్యేవారు..ప్రత్యేకించి నార్త్ నుంచి వచ్చే వారు కాస్త ఆర్భాటంగానే కనిపిస్తారు. కానీ తెలుగు హీరోయిన్ శ్రీలీల మాత్రం అలాంటి వారికి భిన్నం అంటుంది.
నలుగురిలో కలిసే నటి:
చిన్నప్పటి నుంచి తాను ఎలాంటి కష్టాలు..సమస్యలు..ఇబ్బందులు లేకుండా పెరిగినా? గోల్డ్ స్పూన్ లా ఉండటం మాత్రం తనకు ఎంత మాత్రం నచ్చదంది. చాలా సింపుల్ గా లైఫ్ లీడ్ చేయడం ఇష్టమంది. హంగామా, ఆర్భాటం చేయడం...ఇంగ్లీష్ లో పుట్టి పెరిగిన అమ్మాయిలా రకరకాల స్లాంగ్స్ లో మాట్లాడటం ఇలాంటివి చేయడం తనకు నచ్చవంది. ఇంట్లో సాధారణ తెలుగు అమ్మాయిలా ఉంటానంది. తల్లిదండ్రులతో నడుచుకునే విధానం గానీ...ఇతర కుటుంబ సభ్యులతో మెలిగే విధానం అంతా చాలా సింపుల్ గా ఉంటుందని తెలిపింది.
శ్రీలీల డౌన్ టూ ఎర్త్:
చుట్టు పక్కల వారితోనూ..తెలిసిన వారిన ఆప్యాయంగా పలకరిచండం వంటివి చిన్న నాటి నుంచి తనకున్న అలవాటు గా పేర్కొంది. తానేదో సినిమా నటిని అని మూతి బిగించుకుని మూల కూర్చోవడం...బిల్డప్ లు కొట్టడం తనకు అస్సలు అలవాటు లేవంది. తానెంత సరదాగా ఉంటాను అన్నది సోషల్ మీడియాలో తన పోస్ట్ చేసిన వీడియోలు చూస్తే అర్దమవుతుందని తెలిపింది. శ్రీలీల చెప్పిందంతా అక్షర సత్యం. ఈ తెలుగు నటి ఎంతో డౌటన్ ఎర్త్ ఉంటుంది.
