Begin typing your search above and press return to search.

అప్పన్న దర్శనానికి శ్రీలీల.. ఎంత క్యూట్ గా ఉందో!

అనంతరం అక్కడి నుంచి సింహాచలం వెళ్లి అక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శనం చేసుకున్న శ్రీలీల.. ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు.

By:  M Prashanth   |   15 Dec 2025 11:54 AM IST
అప్పన్న దర్శనానికి శ్రీలీల.. ఎంత క్యూట్ గా ఉందో!
X

యంగ్ హీరోయిన్ శ్రీలీల.. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయా చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ.. పర్సనల్ లైఫ్ ను చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ప్రైవేట్ ఈవెంట్స్ కు అటెండ్ అవుతూ సందడి చేస్తుంటారు. రీసెంట్ గా ఉత్తరాంధ్ర వెళ్లిన శ్రీలీల.. ఆలయాల సందర్శనతో బిజీ బిజీగా గడిపారు.

విజయనగరం జిల్లాలోని రాజాంలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేసిన శ్రీలీల.. ఆ తర్వాత విశాఖపట్నం చేరుకుని వివిధ గుళ్లకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ముందుగా.. విశాఖ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. ఆ తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం అక్కడి నుంచి సింహాచలం వెళ్లి అక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శనం చేసుకున్న శ్రీలీల.. ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అర్చకులు అష్టోత్తరం పూజ నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. సంప్రదాయం ప్రకారం ప్రసాదం, శేష వస్త్రాలు ఆలయ అధికారులు అందజేశారు.

అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆలయాల సందర్శన సమయంలో అచ్చ తెలుగింటి ఆడపడుచుగా శ్రీలీల కనిపించారు. బ్లూ కలర్ శారీలో చాలా అందంగా కనిపిస్తున్నారని చెప్పాలి. దీంతో సో క్యూట్ మేడమ్ అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.

ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ఆమె టాలీవుడ్ లో మాస్ జాతరతో సందడి చేయగా.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ను కంప్లీట్ చేశారు. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. అయితే బాలీవుడ్ లో మాత్రం అమ్మడు ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో రీసెంట్ గా మరో సినిమాలో నటించేందుకు ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. చూమంతర్ అనే ఫాంటసీ రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు సమాచారం. అనన్య పాండే తప్పుకోవడంతో శ్రీలీలకు అవకాశం వచ్చినట్లు వినికిడి. అలా బాలీవుడ్ లో మాత్రం శ్రీలీల బిజీ బిజీగా గడుపుతోంది. టాలీవుడ్ లో అవకాశాల కోసం చూస్తోంది.