మాయదారి కళ్ళతో మాయ చేస్తున్న శ్రీలీల!
మరోవైపు దీపావళి కావడంతో దీపావళి స్పెషల్ సందర్భంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో భాగంగానే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
By: Madhu Reddy | 20 Oct 2025 10:00 PM ISTశ్రీ లీల.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పేరుకే కన్నడ బ్యూటీ అయినా తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. సౌత్ ,నార్త్ తేడా లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఇకపోతే శ్రీ లీలాకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి కానీ అనుకున్నంత స్థాయిలో ఆమె క్రేజ్ ను నిలబెట్టలేకపోతున్నాయని చెప్పవచ్చు. కారణం ఆమె కథల ఎంపిక విషయంలో లోపమా లేక మరేదైనా కారణమా అన్నది ఇప్పటికీ మిస్టరీనే.
ఇకపోతే తాజాగా ఈమె మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం కూడా జోరుగా ప్రమోషన్స్ మొదలుపెట్టి పలు విషయాలను పంచుకుంటున్నారు. ఇటు శ్రీ లీల కూడా తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
మరోవైపు దీపావళి కావడంతో దీపావళి స్పెషల్ సందర్భంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో భాగంగానే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో చుడీదార్ ధరించిన ఈమె తన కాటుక కళ్ళతో మాయ చేసేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. చేతిలో దీపం పట్టుకొని ఆ దీపాల కాంతిలో తన అందాన్ని రెట్టింపు చేసింది శ్రీలీల. తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఈ అమ్మడి అందానికి ఇప్పుడు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు.
శ్రీలీల విషయానికొస్తే.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తో మాస్ జాతర సినిమా చేస్తోంది. ఈ సినిమాతో పాటు అటు బాలీవుడ్ లో కూడా ఆషికీ 3 లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది శ్రీ లీల. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతోంది.
శ్రీ లీల కెరియర్ విషయానికి వస్తే పెళ్లి సందD సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలేవి కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ మాస్ జాతర పైనే ఉన్నాయి.. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
