Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : నల్ల చీర కట్టులో తెల్ల కలువ

కన్నడ మూవీ 'కిస్‌'తో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. కన్నడంలో బ్యాక్ టు బ్యాక్‌ రెండు సినిమాలు చేయగానే శ్రీలీలకు తెలుగులో ఆఫర్ దక్కింది.

By:  Ramesh Palla   |   1 Sept 2025 10:16 AM IST
పిక్‌టాక్ : నల్ల చీర కట్టులో తెల్ల కలువ
X

కన్నడ మూవీ 'కిస్‌'తో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. కన్నడంలో బ్యాక్ టు బ్యాక్‌ రెండు సినిమాలు చేయగానే శ్రీలీలకు తెలుగులో ఆఫర్ దక్కింది. ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నిర్మాణంలో, దర్శకత్వ పర్యవేక్షణ లో రూపొందిన 'పెళ్లి సందడి' సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా అట్లర్‌ ఫ్లాప్‌ అయినా కూడా శ్రీలీలకు మంచి గుర్తింపు దక్కింది. అంతే కాకుండా ఆమె డాన్స్ గురించి అంతా మాట్లాడుకున్నారు. పెళ్లి సందడి ఫలితంతో పట్టింపు లేకుండా రవితేజ హీరోగా రూపొందిన 'ధమాకా' సినిమా కోసం శ్రీలీలను ఎంపిక చేయడం జరిగింది. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో పాటు, అందులో శ్రీలీల చేసిన పాత్ర, డాన్స్ ఆమె స్థాయిని ఒక్కసారిగా పెంచడంతో పాటు, టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్ జాబితాలో చేర్చింది అనడంలో సందేహం లేదు.


మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలో...

ధమాకా ఇచ్చిన హిట్‌ తో మొత్తం సీన్ మారి పోయింది. ఆకట్టుకునే అందంతో పాటు, చాలా ఉత్సాహంగా ఉండటం, డాన్స్ లో దూకుడు ఇలా చాలా విషయాల్లో శ్రీలీల ఎంతో మంది హీరోయిన్స్‌తో పోల్చితే ముందు వరుసలో ఉంది. అందుకే శ్రీలీల ఒక్కసారిగా టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. గుంటూరు కారం సినిమాలో ఏకంగా మహేష్‌ బాబుకు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. పవన్‌ కళ్యాణ్‌ తోనూ సినిమాలో నటించేందుకు రెడీ అయిన శ్రీలీల ముందు ముందు మరిన్ని పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు, నటన ప్రతిభ ఉన్న హీరోయిన్స్ కి ఎప్పుడూ ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉంటాయి, ప్రేక్షకుల అభిమానం దక్కుతుంది అంటారు. అది ఈమె విషయంలో నిరూపితం అయింది అనడంలో సందేహం లేదు.


చీర కట్టి కవ్విస్తున్న శ్రీలీల..

శ్రీలీల సాధారణంగానే చాలా అందంగా ఉంటుంది. అల్ట్రా మోడ్రన్‌ డ్రెస్‌లతో ఆకట్టుకున్న శ్రీలీల మరోసారి తన అందమైన చీర కట్టు ఫోటోలతో సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. చూపు తిప్పనివ్వకుండా నల్ల చీర కట్టిన ఈ తెల్ల కలువ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందానికి తోడు ఇలా చీర కట్టుతో కవ్వింపులకు పాల్పడుతున్న శ్రీలీలను చూసి చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు. మొన్న మొన్నటి వరకు చాలా చిన్నగా అనిపించిన శ్రీలీల ఇంతలో ఇంత అందంగా ఎలా మారింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల అందానికి పెద్ద స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కాల్సిందే అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 లో చేసిన కిస్సిక్‌ ఐటెం సాంగ్‌ తో బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు బిజీ అయిన విషయం తెల్సిందే.


ఆషికి 3 సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది, ఇక హిందీలో ఆషికి 3 సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆషికి ప్రాంచైజీ మూవీ కావడంతో ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే ఆషికి 3 సినిమా హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్కడ హిట్‌ అయితే తెలుగులోనూ డబ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక తమిళ్‌లోనూ ఈ అమ్మడు పరాశక్తి సినిమాతో ఎంట్రీకి రెడీ అయింది. కన్నడ, హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించి, నటిస్తున్న శ్రీలీల పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ అనడంలో సందేహం లేదు అంటూ ఆమె అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. రాబోయే పదేళ్లు శ్రీలీల జోరు కంటిన్యూ కావడం ఖాయం.